News March 4, 2025

సర్వేలు త్వరగా పూర్తి చేయండి: జేసీ

image

అల్లూరి జిల్లాలో జరుగుతున్న అన్ని రకాల సర్వేలను నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఐటీడీఏ పీవోలు, 22 మండలాల ఎంపీడీవోలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఎంఎస్ఎంఈ, మిస్సింగ్ సిటిజన్స్, ఆధార్ నమోదు లేని పిల్లలు, జనన మరణాల ఆలస్య నమోదు, స్కూల్ టాయిలెట్ తనిఖీ, వర్క్ ఫ్రమ్ హోం, పీ4, తదితర సర్వేలు వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.

Similar News

News March 5, 2025

ఒకటో తేదీనే మిడ్ డే మీల్ బిల్లులు

image

TG: స్కూళ్లలో మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రతినెలా ఒకటో తేదీనే బిల్లులు చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది. తొలుత పెద్దపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ప్రతినెలా ఎంత మంది విద్యార్థులు భోజనం చేశారో MDM యాప్‌లో నమోదు చేయగానే బిల్లు జనరేట్ అయ్యేలా మార్పులు చేయనుంది. బిల్లుకు HM, MEO ఆమోదం తెలపగానే ఖాతాల్లో బిల్లు మొత్తం జమ అవుతుంది.

News March 5, 2025

రఘువర్మ ఓటమికి కూటమే కారణం: శంబంగి

image

ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రఘువర్మ ఓటమికి ప్రభుత్వ వ్యతిరేకతే కారణమని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. రఘువర్మను గెలిపించాలని ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారం చేశారని, ఓటమితో గాదె కూడా తమ అభ్యర్థి అనడం విడ్డూరంగా ఉందన్నారు.

News March 5, 2025

సైబర్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: MP 

image

రోజురోజుకూ పెరుగుతున్న సైబర్‌ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు MP ప్రసాద్ రావు సూచించారు. డిజిటల్‌ అరెస్టు, కేవైసీ, ఓటీపీ, లాటరీ స్కామ్‌, క్రెడిట్‌ అండ్‌ డెబిట్‌ కార్డ్‌ స్కామ్‌, ఫేక్‌ యాప్స్‌, లోన్‌ స్కామ్స్‌, వర్క్‌ ఫ్రం హోమ్‌, యూపీఐ స్కామ్స్‌ వంటి సైబర్‌ మోసాల్లో ప్రజలు చిక్కుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

error: Content is protected !!