News January 17, 2025
సర్వే పారదర్శకంగా నిర్వహించాలి: ADB కలెక్టర్

లబ్ధిదారుల ఎంపికకు నిర్వహించే సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం ఆదిలాబాద్‌లోని అనుకుంటలో సర్వేను ఆయన మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పై సర్వే నిర్వహిస్తున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలను సేకరించారు. కమిషనర్ సీవీఎన్ రాజు, తదితరులున్నారు.
Similar News
News February 26, 2026
ఉట్నూర్ ఐటీడీఏ PO ఖుష్బూ గుప్త బదిలీ

రాష్ట్రవ్యాప్త ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఉట్నూర్ ఐటీడీఏ PO ఖుష్బూ గుప్తను ప్రభుత్వం బదిలీ చేసింది. మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రాజెక్ట్ అధికారిగా ఖుష్బూ గుప్త మహిళ స్వయం సంఘాల అభివృద్ధి ఉపాధి కల్పన తదితర అంశాలపై జాతీయస్థాయిలో అవార్డును సైతం పొందారు. అనంతరం వ్యక్తిగత సెలవులపై వెళ్లిన పిఓ స్థానంలో ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్ పిఓ వ్యవహరిస్తున్నారు..
News February 25, 2026
FLASH: ఇంద్రవెళ్లిలో యాక్సిడెంట్

ఇంద్రవెళ్లి మండల కేంద్రంలో ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై నుంచి పడి గాయాల పాలయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలోని అంజి రోడ్డు వద్ద బైక్ అదుపుతప్పి వ్యక్తి కింద పడిపోగా గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు అపస్మారక స్థితిలో ఉండడంతో ఆ వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది.
News February 25, 2026
ADB: మార్చి 28కి జాతీయ లోక్ అదాలత్ వాయిదా

ఆదిలాబాద్ జిల్లాలో మార్చి 14న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ అదే నెల 28వ తేదీకి వాయిదా పడినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు వెల్లడించారు. అదనంగా లభించిన ఈ రెండు వారాల సమయాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పరస్పర అంగీకారంతో రాజీ పడటం ద్వారా దీర్ఘకాలిక కేసుల నుంచి విముక్తి పొందవచ్చని, మార్చి 28న జరిగే అదాలత్‌లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు.


