News October 22, 2024
సర్వే ప్రక్రియను ఈనెల 24వ తేదీలోపు పూర్తి చేయాలి: కలెక్టర్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉల్లాస్ పథకం కింద వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే సర్వే ప్రక్రియను ఈనెల 24వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ ఛాంబర్లో ఉల్లాస్ కార్యక్రమంపై జిల్లాస్థాయి కమిటీ కన్వర్జెన్స్ సమావేశం జరిగింది. ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాజిక కార్యకర్తలు భాగస్వామ్యం కావాలని కోరారు.
Similar News
News November 4, 2025
ఆదోని మార్కెట్లో పత్తి ధర రూ.7,555

ఆదోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు నమోదయ్యాయి. పత్తి కనిష్ఠంగా రూ.4,000, గరిష్ఠంగా రూ.7,555 పలికింది. వేరుశనగ గరిష్ఠ ధర రూ.6,666, ఆముదాలు రూ.5,940 వరకు అమ్ముడయ్యాయి. సీసీఐ కొనుగోళ్లలో తేమ శాతం పేరుతో మోసపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
News November 4, 2025
జిల్లా అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

జిల్లా అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులనున ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి పీజీఆర్ఎస్, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, తాగునీరు, శానిటేషన్, వ్యవసాయం తదితర అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రతి శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి, ప్రజా సేవల నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు.
News November 3, 2025
13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్ తెలిపారు. అక్టోబర్ 25న లీప్ యాప్లో అటెండెన్స్ మార్కు చేయని కారణంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం 13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


