News March 13, 2025

సలహాలు, సూచ‌న‌లు ఇవ్వండి: విశాఖ కలెక్టర్

image

ఈఆర్వో, డీఈవో, సీఈవో స్థాయిలో పరిష్కారంకాని ఏవైనా సమస్యలపై భారత ఎన్నికల సంఘానికి నేరుగా సూచ‌న‌లు ఇవ్వొచ్చ‌ని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ‌, ప్రాంతీయ‌ రాజ‌కీయ పార్టీల‌కు ఆహ్వానం తెలుపుతూ ఎన్నిక‌ల సంఘం వెసులుబాటు కల్పించిందని కలెక్టర్ వివరించారు. రాజ‌కీయ పార్టీల‌కు విడివిడిగా ఎన్నిక‌ల సంఘం లేఖలు పంపినట్లు పేర్కొన్నారు.

Similar News

News November 14, 2025

బీహార్ విజయంపై ఎన్డీయే నేతల సెలబ్రేషన్స్

image

బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయాన్ని పురస్కరించుకుని విశాఖలో సీఎం చంద్రబాబు కూటమి నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కూటమి ఎంపీలు పరస్పరం స్వీట్లు తినిపించుకొని ఆనందం పంచుకున్నారు.

News November 14, 2025

మూడేళ్లలో విశాఖలో లూలూ మాల్

image

మూడేళ్లలో విశాఖలో ‘లూలూ’ మాల్‌ను పూర్తి చేయనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్‌ యూసఫ్ అలీ తెలిపారు. CII సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. 2018లో మాల్‌కు శంకుస్థాపన చేశామన్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత పలు కారణాలతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ మళ్లీ తెరపైకి వచ్చిందన్నారు. ఈ మాల్‌ ద్వారా ప్రత్యక్షంగా 5వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.

News November 14, 2025

ఆల్పాహార విందులో పాల్గొన్న ఉపరాష్ట్రపతి

image

విశాఖపట్నంలో జరుగుతోన్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వచ్చిన ఉపరాష్ట్రపతి సీ.పీ.రాధాకృష్ణన్‌.. సీఎం చంద్రబాబు ఇచ్చిన అల్పాహార విందులో పాల్గొన్నారు. వీరితో పాటుగవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, ఇతర మంత్రులు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఉన్నారు.