News April 11, 2025

సలేశ్వరం జాతర కోసం 370 మంది పోలీసులు

image

సలేశ్వరం జాతర ఉత్సవాలు ఈ నెల 11 నుంచి 13 వరకు కొనసాగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు ఈ యాత్రలో పాల్గొననున్నారు. సాహసోపేతమైన ఈ యాత్రలో భక్తులు “వస్తున్నాం లింగమయ్య” అంటూ మూడు కిలోమీటర్ల పర్వత మార్గంలో కాలినడకన సాగుతారు. “తెలంగాణ అమరనాథ్ యాత్ర”గా పరిగణిస్తున్నారు. భద్రత కోసం 370 మంది పోలీసు సిబ్బంది, 130 మంది అటవీశాఖ వాలంటీర్లు విధుల్లో పాల్గొంటున్నారు.

Similar News

News December 9, 2025

పిట్లం: ఎన్నికల విధులకు సిద్ధంకండి: సబ్ కలెక్టర్

image

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా, పిట్లంలో మంగళవారం ఎన్నికల సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి హాజరయ్యారు. ఆమె సిబ్బందికి ఎన్నికల నియమాలు, ఓటింగ్ ప్రక్రియ, ఓట్ల లెక్కింపుపై స్పష్టమైన ఆదేశాలు, సలహాలు ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆమె సిబ్బందికి సూచించారు.

News December 9, 2025

పిల్లలు మొండిగా చేస్తున్నారా?

image

కొందరు పిల్లలు ఊరికే అలుగుతుంటే వారిని తిట్టడం లేదా చేయి చేసుకోవడం వల్ల వారు మరింత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల సాధ్యమై నంత వరకు వారిని బుజ్జిగిస్తూ, దారిలోకి రాకపోతే చిన్నగా బెదిరించాలి. కానీ చేయి చేసుకోవడం, తిట్టడం వల్ల మాట వినరంటున్నారు నిపుణులు. వారిని ప్రేమతో పెంచాలి. ఇంట్లో ప్రతికూల వాతావరణం లేకుండా చూసుకోవాలి. అప్పుడే పిల్లలు మొండితనం వీడతారని చెబుతున్నారు.

News December 9, 2025

విద్యార్థుల గళంపై కూటమి ఉక్కుపాదం మోపుతుంది: YCP

image

విద్యార్థుల గళంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని YCP ‘X’లో పోస్ట్ చేసింది. YCP స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని నిరసన తెలిపినందుకు చైతన్యపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారని రాసుకొచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే కేసులా చంద్రబాబు, లోకేశ్ అంటూ ప్రశ్నించారు.