News April 11, 2025
సలేశ్వరం జాతర కోసం 370 మంది పోలీసులు

సలేశ్వరం జాతర ఉత్సవాలు ఈ నెల 11 నుంచి 13 వరకు కొనసాగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు ఈ యాత్రలో పాల్గొననున్నారు. సాహసోపేతమైన ఈ యాత్రలో భక్తులు “వస్తున్నాం లింగమయ్య” అంటూ మూడు కిలోమీటర్ల పర్వత మార్గంలో కాలినడకన సాగుతారు. “తెలంగాణ అమరనాథ్ యాత్ర”గా పరిగణిస్తున్నారు. భద్రత కోసం 370 మంది పోలీసు సిబ్బంది, 130 మంది అటవీశాఖ వాలంటీర్లు విధుల్లో పాల్గొంటున్నారు.
Similar News
News April 19, 2026
గవర్నర్‌తో సీఎం భేటీ.. ఎమ్మెల్సీల ఆమోదంపై చర్చ?

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ HYDలోని లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సమావేశమయ్యారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొ.కోదండరామ్, అజహరుద్దీన్ పేర్లను ఆమోదించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏ సభలోనూ సభ్యుడు కాని అజారుద్దీన్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ నెల 30 లోపు ఎమ్మెల్సీగా ఎంపిక కాకపోతే ఆయన పదవిని కోల్పోయే అవకాశం ఉంది.
News April 19, 2026
ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఇంద్రకీలాద్రిపై ఆదివారం సెలవు దినం కావడంతో కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు తరలివచ్చారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఆలయ ఈవో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం చలివేంద్రాల ద్వారా మజ్జిగ ప్యాకెట్లు, చిన్నారులకు బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన సిబ్బంది పర్యవేక్షిస్తూ తగిన సేవలందిస్తున్నారు.
News April 19, 2026
HYD: పాలిటెక్నిక్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఫ్రీ క్లాసెస్

పాలిటెక్నిక్ ప్రిపేర్ అయ్యేవారికి కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో అనుభవం కలిగిన లెక్చరర్స్ బోధించే పాఠ్యాంశాలు విద్య ఛానల్‌లో సా.5-7 గంటల వరకు, నిపుణ ఛానల్‌లో రా.9-11 గంటల వరకు కోచింగ్ అందుబాటులోకి రానున్నట్లు TSAT సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.


