News April 24, 2024
సలేశ్వరం జాతర.. భక్తుల జేబులకు చిల్లులు !

నల్లమలలో జరిగే సలేశ్వరం జాతరలో భక్తులను వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాల్లో లీటర్ మంచినీళ్ల బాటిల్ రూ.50, ఒక కొబ్బరికాయ రూ.100కు విక్రయిస్తున్నట్లు భక్తులు తెలిపారు. లింగమయ్య ప్రసాదంగా భావించే 3 లడ్డూలను రూ.100కు విక్రయించారు. దీంతో భక్తుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అటూ ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సులు పల్లాయిపల్లి వరకే వెళ్తున్నాయి.
Similar News
News October 29, 2025
అంగరంగ వైభవంగా ఉద్దాల మహోత్సవం

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధానఘట్టమైన ఉద్దాలమహోత్సవం మంగళవారంరాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు లక్షల మంది భక్తులు హాజరై స్వామివారి పాదుకలను దర్శించుకున్నారు. స్వామివారి పాదుకలను తాకి పునితులయ్యేందుకు భక్తులు పోటీపడ్డారు. దీంతో చిన్నవడ్డేమాన్, ఊకచెట్టువాగు, అప్పంపల్లి, తిర్మలాపూర్ గ్రామాలతోపాటు స్వామి ఆలయం వరకు జనసంద్రంమైంది. ఉత్సవంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
News October 29, 2025
MBNR: కురుమూర్తి జాతర.. సమీక్షించిన ఎస్పీ

మహబూబ్నగర్ జిల్లా చిన్న తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి జాతర సందర్భంగా ఈ రోజు ఉద్దాల బందోబస్త్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డి.జానకి స్వయంగా పరిశీలించారు. చిన్న వడ్డెమాన్ గ్రామం నుంచి ఉద్దాల కార్యక్రమం ప్రారంభమైన ప్రాంతం నుంచి ఉద్దాల గుడి వరకు ఎస్పీ స్వయంగా పర్యటించి, భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ సదుపాయాలు, పార్కింగ్ సౌకర్యం, భద్రతా, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లను సమీక్షించారు.
News October 28, 2025
MBNR: టీఆర్పి పార్టీ మేధావుల నిపుణుల కమిటీ ఛైర్మన్ నియామకం

MBNR జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ డీఈవో, డాక్టర్ శివార్చక విజయ్ కుమార్ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న వీరిని రాష్ట్ర మేధావులు, నిపుణుల సమన్వయ కమిటీ ఛైర్మన్గా నియమించారు. వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను అంకితభావం నిబద్దతతో కలుపుకొని క్షేత్రస్థాయిలో కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు.


