News April 13, 2025
సళేశ్వరం జాతరకు ఆ నిబంధన ఎత్తేసిన అధికారులు

సళేశ్వరం జాతరలో ఫారెస్ట్ అధికారులు ట్రాఫిక్ భారీగా పెరుగుతుండడంతో ప్లాస్టిక్ చెకింగ్ నిబంధనను ఎత్తేశారు. పౌర్ణమి సందర్భంగా స్వామి ఆలయంలో జరిగే వింతను చూసేందుకు భారీగా జనాలు వచ్చారు. దీంతో మన్ననూర్ చెక్ పోస్ట్ వద్ద ప్రతి వాహనంలో ప్లాస్టిక్ బాటిల్స్ చెక్ చేయడంతో హాజీపూర్ నుంచి వాహనాలు భారీగా నిలిచాయి. దీంతో ఫారెస్ట్ అధికారులు ప్లాస్టిక్ చెకింగ్‌ను తాత్కాలికంగా నిలిపేశారు.
Similar News
News November 16, 2025
గవర్నర్ పర్యటనకు పటిష్ఠ భద్రత కల్పించాలి: SP

ఇవాళ బాపట్ల జిల్లాకు వస్తున్న గవర్నర్‌కు పటిష్ఠ భద్రత కల్పించాలని ఎస్పీ ఉమామహేశ్వర్ సిబ్బందికి సూచించారు. సూర్యలంక వద్ద గవర్నర్ పర్యటించనున్న ప్రాంతాలను ఆయన శనివారం పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి వివరించారు. కాన్వాయ్ వచ్చే సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని, తిరిగి వెళ్లే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
News November 16, 2025
మెదక్: దరఖాస్తుల ఆహ్వానం

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3 పురస్కరించుకొని రాష్ట్రస్థాయిలో అందించే పురస్కారాలకు అర్హులైన వ్యక్తులు, సంస్థల నిర్వాహకుల నుంచి ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తెలిపారు. దరఖాస్తులను ఈనెల 17 వరకు https://wdsc.telangana.gov.in సమర్పించాలని సూచించారు.
News November 16, 2025
పశువులకు మేతగా ఉల్లిపాయలతో డేంజర్

ఉల్లికి సరైన ధర లేకపోతే కొందరు రైతులు ఆ పొలాలను గొర్రెలు, మేకలు, పశువులకు మేతగా వదిలేస్తున్నారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరమని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయల్లో ఉండే N-propyl disulfide అనే రసాయనం పశువుల్లోని ఎర్రరక్తకణాలను విడదీస్తుందని తెలిపారు. దీనివల్ల వాటిలో బలహీనత, కళ్లు, మూత్రం ఎర్రగా మారడం, శ్వాసలో వేగం పెరగడం, కడుపులో వాపు, లక్షణాలు తీవ్రమైతే అవి మరణించే అవకాశం ఉందంటున్నారు.


