News April 12, 2025
సళేశ్వరం జాతరలో పోలీసులకు సహకరించాలి: అచ్చంపేట డీఎస్పీ

అమ్రాబాద్ నల్లమల్ల ప్రాంతంలోని అటవీ ప్రాంతంలోని శ్రీ సళేశ్వరం లింగమయ్య స్వామి జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులు పోలీసు అధికారులకు సహకరించాలని అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్ కోరారు. శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో భక్తులు వేలాదిగా తరలిరానున్నారన్నారు. భక్తులు స్వామివారి దర్శనం అనంతరం అక్కడ సేద తీరకుండా ఇతర భక్తులకు అవకాశం కల్పించేందుకు వెంటనే తిరుగు ప్రయాణం కావాలని సూచించారు.
Similar News
News December 2, 2025
తిరుపతిలో విషాదం.. ఓ ఇంట్లో మూడు మృతదేహాలు

తిరుపతి సమీపంలోని దామినేడులో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో కుళ్లిన మూడు మృతదేహాలు కలకలం రేపాయి. ఇవి తమిళనాడు రాష్ట్రం, గుడియాత్తంకు చెందిన సత్యరాజ్, పొన్నాగుట్టె నాయగి, మనీశ్ మృతదేహాలుగా పోలీసులు గుర్తించారు. స్థానికులకు దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 2, 2025
పాపవినాశనం డ్యాంపై శాస్త్రవేత్తల పరిశీలన

తిరుమలలోని పాపవినాశనం డ్యాంను ముగ్గురు శాస్త్రవేత్తలు సోమవారం పరిశీలించారు. డ్యాం సేఫ్టీ ఎవల్యూషన్లో భాగంగా జలవనరుల శాఖ, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి చెందిన శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. నీటి నిల్వతో పాటు పలు జాగ్రత్తలపై రిమోట్ ఆపరేటింగ్ వెహికల్తో పరిశీలించారు.
News December 2, 2025
ఏపీ వాట్సాప్ గవర్నెన్స్కు అత్యధిక హిట్స్

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్కు తొలిసారిగా అత్యధిక హిట్స్ టీటీడీ వల్ల వచ్చింది. నవంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన డిప్ సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం చూస్తే 1.5 లక్షల మంది భక్తులు తమ పేర్లు ఈ డిప్లో వాట్సప్ ద్వారా నమోదు చేసుకున్నారు. ఈ సేవ వచ్చిన తర్వాత 3 రోజుల్లో ఇన్ని హిట్స్ రావడం ఇదే అత్యధికమని అంటున్నారు.


