News April 12, 2025
సళేశ్వరం జాతరలో పోలీసులకు సహకరించాలి: అచ్చంపేట డీఎస్పీ

అమ్రాబాద్ నల్లమల్ల ప్రాంతంలోని అటవీ ప్రాంతంలోని శ్రీ సళేశ్వరం లింగమయ్య స్వామి జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులు పోలీసు అధికారులకు సహకరించాలని అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్ కోరారు. శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో భక్తులు వేలాదిగా తరలిరానున్నారన్నారు. భక్తులు స్వామివారి దర్శనం అనంతరం అక్కడ సేద తీరకుండా ఇతర భక్తులకు అవకాశం కల్పించేందుకు వెంటనే తిరుగు ప్రయాణం కావాలని సూచించారు.
Similar News
News April 22, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 604 యూనిట్ల పంపిణీ

శ్రీ సత్యసాయి జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 604 యూనిట్లు పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో బ్యాంక్, వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు.
News April 22, 2025
గిల్ పెళ్లిపై ప్రశ్న.. ఆయన ఆన్సరిదే

నిన్న KKR-GT మ్యాచ్ టాస్ సందర్భంగా శుభ్‌మన్ గిల్ పెళ్లి ప్లాన్స్ గురించి అడిగి కామెంటేటర్ డానీ మోరిసన్ నవ్వులు పూయించారు. ‘నువ్వు అందంగా ఉన్నావ్. త్వరలో పెళ్లి చేసుకుంటున్నావా?’ అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని ప్రిన్స్ సమాధానమిచ్చారు. కాగా సచిన్ కూతురు సారాతో గిల్ డేటింగ్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై వీరిద్దరూ స్పందించలేదు.
News April 22, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.