News March 18, 2025

సవిత షటిల్.. పరిటాల సునీత క్యారమ్స్‌

image

విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియంలో నేటి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు జరగనున్నాయి. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. టెన్నికాయిట్, టగ్‌ ఆఫ్‌ వార్, షటిల్‌ బ్యాడ్మింటన్‌లో మంత్రి సవిత పాల్గొంటారు. క్యారమ్స్‌లో ఆడేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత తన పేరును నమోదు చేసుకున్నారు. 100M పరుగు పందెంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పోటీ పడనున్నారు. మడకశిర ఎమ్మెల్యే రాజు క్రికెట్ ఆడనున్నారు.

Similar News

News July 7, 2025

షార్ట్ ఫిలిం పోటీలకు దరఖాస్తు చేసుకోండి: ములుగు కలెక్టర్

image

జాతీయ మానవ హక్కుల సంఘం(NHRC) ఆధ్వర్యంలో నిర్వహించే షార్ట్ ఫిలిం పోటీలకు అన్ని వర్గాల ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. మానవ హక్కులపై అవగాహన కల్పించే విధంగా 3 నుంచి 10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలింలను nhrcshrotfilm@gmail.comకు పంపించాలన్నారు. విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు రూ.2 లక్షల నుంచి రూ.లక్ష వరకు అందిస్తారన్నారు.

News July 7, 2025

నస్పూర్: జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం

image

హైదరాబాద్‌లో 5 రోజులుగా జరుగుతున్న జాతీయస్థాయి జూనియర్ వుషూ పోటీల్లో నస్పూర్‌కు చెందిన అత్కపురం హాసిని ప్రతిభ కనబరిచి టైలు విభాగంలో బంగారు పథకం సాధించింది. తెలంగాణ SAI ఛైర్మన్ శివసేన రెడ్డి, వైస్ ఛైర్మన్ సోని బాలదేవి చేతులమీదుగా బంగారు పథకాన్ని హాసిని అందుకుంది. క్రీడాకారిణి హాసిని, కోచ్ శివమహేశ్‌ను జిల్లా వుషూ సంఘం ప్రెసిడెంట్ వేముల సతీశ్, జనరల్ సెక్రటరీ రాజనర్సు అభినందించారు.

News July 7, 2025

దండేపల్లి: అత్తారింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

image

అత్తారింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన దండేపల్లి మండలం గుడిరేవులో జరిగింది. ఎస్ఐ తహిసోద్దీన్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రూపను భర్త, అత్తమామలు, సమీప బంధువులు వేధింపులకు గురి చేయడంతో ఆమె ఈ నెల 5న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. రూప తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.