News July 14, 2024

సహజవనరుల దోపిడీపై రేపు శ్వేతపత్రం: సీఎం చంద్రబాబు

image

మరో శ్వేతపత్రం విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు ఏపీ సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం, అమరావతి, విద్యుత్ శాఖపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం రేపు గత ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై స్వయంగా సీఎం చంద్రబాబు వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు.

Similar News

News November 16, 2025

మీకోసంను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేస్తే తగు విచారణ జరిపి పరిష్కరిస్తామన్నారు.

News November 16, 2025

కృష్ణా: సోషల్ మీడియా పోస్టుపై స్పందించిన పోలీసులు

image

కృష్ణా జిల్లా పెడనలో జరగనున్న పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం వ్యాపార సముదాయాల బహిరంగ వేలం పాటల నిర్వహణ జరిగింది. ఆ వేలం పాటకు హాజరైన పలువురి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, “మొన్న ఢిల్లీలో జరిగింది.. నేడు గల్లీలో జరుగుతోంది” అంటూ వ్యాఖ్యానించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News November 16, 2025

కృష్ణా జిల్లాలో ‘దాళ్వా’ సాగుపై సందిగ్ధత.!

image

కృష్ణా జిల్లాలో దాళ్వా సాగుపై సందిగ్ధత నెలకొంది. రెండవ పంటగా దాళ్వాకు సాగునీరు ఇవ్వాలని రైతుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. కానీ జలాశయాల్లో నీటి నిల్వలు అంతంత మాత్రంగా ఉండటం వల్ల దాళ్వాకు సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. దాళ్వాకు ప్రత్యామ్నాయంగా అపరాల సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రజాప్రతినిధులు సైతం లోపాయికారిగా రైతులకు ఇదే చెబుతుండటం విశేషం.