News August 16, 2024
సహజీవనం.. గంజాయి తాగాలని వేధించినందుకు హత్య

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మసీదు రోడ్డుకు చెందిన నోయల్ జార్జ్ను హత్య చేసిన కేసులో నిందితులు ప్రసాద్, ప్రశాంతి, ప్రేమ్ కుమార్ను శుక్రవారం అరెస్టు చేసినట్లు రాజోలు CI గోవిందరాజు, మలికిపురం SI సురేష్ తెలిపారు. గుడిమెల్లంకకు చెందిన ప్రశాంతి నోయల్ జార్జ్తో సహజీవనం చేసేది. జార్జ్ మందు, సిగరెట్, గంజాయికి బానిసై, ప్రశాంతిని కూడా తాగమని వేధించడంతో పథకం ప్రకారం అతడిని హత్య చేసినట్లు వివరించారు.
Similar News
News December 9, 2025
తూ.గో: డిప్యూటీ సీఎం శాఖలో జీతాల కష్టాలు

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్డబ్ల్యూఎస్ శాఖలో ఉద్యోగులు జీతాలు అందక ఆకలి కేకలు వేస్తున్నారు.
తూ.గో జిల్లా నీటి నాణ్యత పరీక్షా కేంద్రాల సిబ్బందికి ఆగస్టు నుంచి ఐదు నెలల వేతనాలు అందలేదు. క్రిస్మస్, సంక్రాంతి సమీపిస్తున్న వేళ జీతాలు రాకపోవడంతో వేతన జీవుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వెంటనే బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
News December 9, 2025
తూ.గో: విదేశీ ఉద్యోగాల ఎర.. రూ.4 కోట్లకు టోకరా

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి రూ. 4 కోట్లు వసూలు చేసిన ఘరానా మోసం నిడదవోలు మండలం గోపవరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. యంట్రపాటి విజయలక్ష్మి, భాగ్యం తదితరులు తమను నిండా ముంచారని బాధితులు వాపోయారు. డబ్బులు తిరిగి అడిగితే ముఖం చాటేస్తున్నారని, తమకు న్యాయం చేయాలంటూ సోమవారం కలెక్టర్, జిల్లా జడ్జికి వారు ఫిర్యాదు చేశారు.
News December 9, 2025
విదేశీ ఉద్యోగాల ఎర.. రూ.4 కోట్లకు టోకరా