News April 17, 2024

సహనకు కంగ్రాట్స్ చెప్పిన స్మితా సబర్వాల్

image

కరీంనగర్‌కు చెందిన కొలనుపాక సహన సివిల్స్ ఫలితాల్లో 739వ ర్యాంకు సాధించారు. గతంలో కరీంనగర్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహించిన స్మితా సబర్వాల్ తనకు ఆదర్శమన్నారు. ఏ క్యాడర్ వచ్చినా IAS కావడమే లక్ష్యమని పేర్కొన్నారు. తన రోల్ మోడల్ స్మితా సబర్వాల్ అని సహన పేర్కొనగా.. ట్విట్టర్‌లో స్మిత స్పందించారు. ‘ప్రియమైన సహన.. మీ ఎంపికకు శుభాకాంక్షలు. So proud of you’ అంటూ అభినందనలు తెలిపారు.  

Similar News

News October 8, 2024

డబుల్ డోస్‌తో నాని మూవీ: శ్రీకాంత్ ఓదెల

image

డబుల్ డోస్‌తో నాని మూవీ ఉంటుందని డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ పేర్కొన్నారు. మంగళవారం చీకురాయిలో మాజీ జడ్పీటీసీ బండారు రామ్మూర్తి డైరెక్టర్ శ్రీకాంత్‌ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. తన తదుపరి చిత్రంతో నానితో ఉంటుందన్నారు. దసరాను మించిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్రం ఉండనుందని ఆయన తెలిపారు.

News October 8, 2024

జగిత్యాల: ఉపాధి కల్పనకు కసరత్తు

image

ఉపాధిహామీ పథకం కింద గ్రామీణ కూలీలకు చేతినిండా పని కల్పించడానికి జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను గుర్తించారు. వచ్చే నెలలో మండలాల వారిగా ప్రణాళికలు ఖరారు చేయనున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా 1.67 లక్షల జాబ్ కార్డుల పరిధిలో 2.73 లక్షల మంది కూలీలు ఉన్నారు.

News October 8, 2024

సిరిసిల్ల: పత్తి కొనుగోలు కేంద్రాలకు మౌలిక వసతుల కల్పన

image

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో వచ్చే పత్తి పంటను మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ కలెక్టరేట్‌లో పత్తి కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో పత్తి కొనుగోలు యాక్షన్ ప్లాన్‌ను అధికారులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు.