News September 27, 2024
‘సాంకేతికతతో మెరుగైన ఉపాధి అవకాశాలు’

ప.గో జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో లబ్ధిదారులకు మెరుగైన ఉపాధి అవకాశాలను అందించడంలో సాంకేతికత, సౌర విద్యుత్ను వినియోగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం భీమవరం కలెక్టరేట్లో జిల్లాలో ఉపాధి అవకాశాల మెరుగుదలకు కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్, న్యూఢిల్లీ (సీఇఇడబ్ల్యూ) ప్రతినిధులు, వ్యవసాయ, ఉద్యాన అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు.
Similar News
News November 27, 2025
కంబోడియా సూత్రధారి.. ప.గోలో 13 మంది అరెస్టు

భీమవరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శర్మ నుంచి రూ.78 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. కంబోడియాకు చెందిన ప్రధాన సూత్రధారి రహేత్ జె నయన్ సహకారంతో.. ‘కార్డ్ డీల్’ పద్ధతిలో ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 13 మందిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ నాగరాణి

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం పాలకోడేరు మండలం కుముదవల్లి రైతు సేవా కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తేమ శాతం లెక్కింపు, గోనె సంచుల పంపిణీ రిజిస్టర్లను పరిశీలించారు. రైతులు వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవాలని ఆమె సూచించారు. జేడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.