News March 21, 2025
సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన సేవలు: పల్నాడు SP

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మెరుగైన సేవలందించాలని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నూతన చట్టాలపై అవగాహన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉన్నత విద్యను అభ్యసించిన కానిస్టేబుళ్లు ఉన్నారని అన్నారు. వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి మెరుగైన సేవలు అందించేందుకు తోడ్పాటు ఇవ్వాలని కోరారు.
Similar News
News November 21, 2025
వరంగల్: రేపు జాబ్ మేళా

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి బి. సాత్విక కోరారు. ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్ వద్ద ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు ఉండి, ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు ఈ మేళాకు అర్హులన్నారు.
News November 21, 2025
HYD: దొంగ నల్లా కనెక్షన్పై ఫిర్యాదు చేయండి

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నల్లా అక్రమ కనెక్షన్లపై అధికారుల రైడ్ కొనసాగుతుంది. అనేక ప్రాంతాల్లో దాదాపుగా 50 మందికిపైగా వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అక్రమ కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకున్న వారు, కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తే 99899 98100 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
News November 21, 2025
వేరుశనగలో తుప్పు/ కుంకుమ తెగులు – నివారణ

పెరిగిన చలి తీవ్రత, తేమ వాతావరణంతో వేరుశనగలో తుప్పు లేదా కుంకుమ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క ఆకుల అడుగు భాగంలో ఇటుక రంగు/ఎరుపు రంగు చిన్న చిన్న పొక్కులు ఏర్పడి, ఆకుల పైభాగంలో పసుపు మచ్చలు కనిపిస్తాయి. ఉద్ధృతి ఎక్కువైతే ఈ పొక్కులు మొక్క అన్ని భాగాలపై కనిపిస్తాయి. తుప్పు తెగులు కట్టడికి 200 లీటర్ల నీటిలో క్లోరోథలోనిల్ 400 గ్రా. లేదా మాంకోజెబ్ 400 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.


