News January 31, 2025
సాంకేతిక పరిజ్ఞానంపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలి: డీఈఓ

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా విద్యాధికారి ప్రొ. రాధాకిషన్ సూచించారు. ‘కలాం స్ఫూర్తి యాత్ర’ పేరిట చేపట్టిన ‘ఫ్లో బస్సు’ (ఫ్యూ చరిస్టికల్ ల్యాబ్ ఆన్ వీల్స్) శుక్రవారం మెదక్ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకోగా ఆయన ప్రారంభించారు. ఫ్లో బస్‌లో సాంకేతిక రంగానికి సంబంధించిన వీఆర్ జోన్, వెదర్ స్టేషన్, రోబోటిక్స్ జోన్, మేకర్ స్పేస్, ఏఆర్ జోన్, ఐఓటీ జోన్ ప్రదర్శించారు.
Similar News
News January 3, 2026
నర్సాపూర్‌లో టెట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

నర్సాపూర్ బీవీఆర్ఐటీ కళాశాలలోని టెట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం సందర్శించారు. జిల్లాలో 200 మంది అభ్యర్థులకు గాను 95 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. మొదటి పేపర్‌కు 65 మంది, రెండో పేపర్‌కు 40 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
News January 3, 2026
మనోహరాబాద్: ‘Way2News’ ఎఫెక్ట్.. గేట్ తొలగింపు

మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారు పల్లె చెరువు బఫర్ జోన్ స్థలానికి ప్రైవేట్ సీడ్ కంపెనీ ఏర్పాటు చేసిన గేటు తొలగించారు. గత నెల 31న ‘<<18725684>>Way2News<<>>’లో పల్లె చెరువు బఫర్ జోన్‌కు గేటు, ఆందోళన అంటూ కథనం ప్రచురితమైంది. 2న అధికారులు సందర్శించి గేటు తొలగించాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖ డీఈ శ్రీకాంత్ ఆదేశాల మేరకు కంపెనీ యాజమాన్యం ఈరోజు బఫర్ జోన్ స్థలానికి ఏర్పాటుచేసిన గేటు తొలగించింది.
News January 3, 2026
మెదక్: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జరగాలి: ఎస్పీ

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు తప్పిపోయిన, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పిల్లలను రక్షించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్–12 పోస్టర్లను ఎస్పీ డీవీ శ్రీనివాస రావు ఆవిష్కరించారు. ఈ విషయంలో అవగాహన ముఖ్యమన్నారు. బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనపు ఎస్పీ మహేందర్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్ ఉన్నారు.


