News February 28, 2025

సాంకేతిక లోపంతో ఇండిగో విమానం అత్యవసర లాండింగ్

image

ఇండిగో విమానం చెన్నై నుంచి గన్నవరం విమానశ్రయానికి చేరుకొని విశాఖపట్నం వెళ్లనుంది. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరే తరుణంలో ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో మొత్తం 54 మంది ప్రయాణికులు, మాజీ మంత్రి డొక్కా కూడా ఉన్నారు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. 

Similar News

News February 26, 2026

అక్షర ఆంధ్ర లక్ష్యంగా ‘ఉల్లాస్-02’ అమలుకు కలెక్టర్ ఆదేశం

image

విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పాల్గొన్నారు. 100 శాతం అక్షరాస్యత సాధనకు కేంద్రం తెచ్చిన ‘ఉల్లాస్-02: అక్షర ఆంధ్ర’ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నిరక్షరాస్యత నిర్మూలనకు అందరూ కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

News February 25, 2026

వాణిజ్య పన్నుల వసూళ్లపై కలెక్టర్ సమీక్ష

image

కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం వాణిజ్య పన్నుల వసూళ్లపై కలెక్టర్ డీకే బాలాజీ సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్తు సేవల పన్నులు (GST) సజావుగా, వంద శాతం వసూలయ్యేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పన్నుల వసూళ్లలో అలసత్వం వహించకుండా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.