News March 31, 2024
సాక్ష్యం యాప్ పై అవగాహన కల్పించాలి: కలెక్టర్
పోలింగ్ కేంద్రాలకు దివ్యాంగులైన ఓటర్లు వచ్చేందుకు ర్యాంపులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో దివ్యాంగులకు ఓటు హక్కు అంశంపై సమీక్ష నిర్వహించారు. ఓటర్ హెల్ప్ లైన్ డెస్క్, బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ షీట్, సహాయకుడిని అందుబాటులో ఉంచాలన్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వారికి హోం ఓటింగ్ విధానంపై రూపొందించిన సాక్ష్యం యాప్‌పై అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News December 28, 2024
గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో దేహదారుడ్య పరీక్షలు- ఎస్పీ
గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుడ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఎస్పీ శుక్రవారం తెలిపారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ మేజర్మెంట్ పరీక్ష(PMT) ఉంటుందన్నారు. ఫిజికల్ ఎఫీషియన్సీ పరీక్షలను(PET) పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 30వ తేదీ నుంచి జనవరి 22వ తేదీ వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
News December 27, 2024
నరసరావుపేట: వివాహిత అనుమానాస్పద మృతి
నరసరావుపేట మండలం గురవాయపాలెం ఎస్సీ కాలనీలో భార్యను చంపి ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా భర్త నమ్మించే ప్రయత్నం చేసిన ఉదంతం శుక్రవారం జరిగింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. భార్య గార్నేపూడి అనితపై అనుమానంతో భర్త రమేష్ కొట్టి చంపాడని, అనంతరం నైలాన్ తాడుతో ఉరి వేశాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట రూరల్ పోలీసులు తెలిపారు.
News December 27, 2024
హెల్మెట్ ధరించటం భారం కాదు బాధ్యత: ఎస్పీ
పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్‌లో వాహనదారులకు నిర్వహించిన హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో హెల్మెట్ తలకు రక్షణగా ఉంటుందని తెలిపారు. హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులను గులాబీలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ నారాయణస్వామి, ఎస్ఐ మేరాజ్ తదితరులు పాల్గొన్నారు.