News July 26, 2024
సాగర్‌కు వరద పెరుగుతోంది

ఉమ్మడి నల్గొండ రైతులకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కీలకం. పంటల సాగు ఎక్కువగా సాగర్ ఆయకట్టు పరిధిలోనే జరుగుతోంది. కొన్ని రోజులుగా సాగర్ నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇక ఎగువన కురుస్తోన్న వర్షాలతో శ్రీశైలం డ్యామ్‌కు వరద పోటేత్తుతుండగా దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు 31,784 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
Similar News
News November 23, 2025
నల్గొండ: పున్నా కైలాస్ నేత రాజకీయ నేపథ్యం

మునుగోడుకు చెందిన పున్నా కైలాస్ నేత ఓయూలో చదువుకునే సమయంలోనే రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలంగా వ్యవహరించారు. ఓయూ విద్యార్థి నేతగా.. విద్యార్థి జేఏసీ వ్యవస్థాపక సభ్యుడిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్‌లో చేరి 2018, 2023లో మునుగోడు MLA టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. 2022 నుంచి TPCC ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
News November 22, 2025
BREAKING: నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా పున్న కైలాష్

డీసీసీ అధ్యక్షులను ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అదిష్ఠానం ప్రకటించింది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పున్న కైలాష్ నేతను నియమించింది. నల్గొండ డీసీసీకి పలువురు పోటీ పడినప్పటికీ మునుగోడుకు చెందిన పున్న కైలాష్ నేతనే డీసీసీ పదవి వరించింది.
News November 22, 2025
NLG: వాట్సప్‌తో ఇక మీ సేవలు..!

నల్గొండ జిల్లా ప్రజలకు అతి ముఖ్యమైన మీ-సేవ సేవలు మరింత సులభతరమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీలో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. జిల్లాలో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా అన్ని రకాల అవసరాల కోసం వివిధ సర్టిఫికెట్స్ పొందడానికి ఇక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా మీ సేవలను వాట్సాప్ ద్వారా పొందే అవకాశం కల్పిస్తోంది. ఇటీవల మంత్రి శ్రీధర్ బాబు కొత్త డిజిటల్ సేవలను ప్రారంభించారు.


