News January 13, 2025
సాగర్తో మందా జగన్నాథంకు అనుబంధం

నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆదివారం అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన స్వస్థలం MBNR జిల్లా ఇటిక్యాల మండలం కొండేరు. జగన్నాథం తండ్రి పెద్దపుల్లయ్య నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇక్కడకు వచ్చి మెకానిక్ విభాగంలో వాచ్మెన్గా పనిచేశారు. ఆయన తల్లి సవరమ్మ హిల్ కాలనీలోని ప్రాజెక్టు హెల్త్ ఆఫీస్లో ఆయాగా పనిచేశారు. జగన్నాథం హిల్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు.
Similar News
News October 23, 2025
MLG: 500 ఓటర్లున్నా జనాబాలో జీరో చూపిస్తోంది: స్థానికులు

జంకుతండ గ్రామ పంచాయతీలో 200కు పైగా ఎస్సీ కుటుంబాలు, 500కు పైగా ఓటర్లు ఉన్నప్పటికీ ఒక్క వార్డు సభ్యుడి స్థానం కూడా కేటాయించలేదని స్థానికులు తెలిపారు. 2011 జనాభా లెక్కల్లో ఎస్సీ జనాభాను ‘జీరో’గా చూపించారు. ఈ మేరకు ఎస్సీ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, నాగరాజు, భరత్, సోమయ్య పాల్గొన్నారు.
News October 23, 2025
మిర్యాలగూడ: డీసీఎంలోనే గుండెపోటుతో డ్రైవర్ మృతి

గుండెపోటుతో డీసీఎం డ్రైవర్ మృతి చెందిన ఘటన జనగామ(D) దేవరుప్పుల(M) కామారెడ్డిగూడెం స్టేజ్ వద్ద బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల ప్రకారం.. మిర్యాలగూడకు చెందిన వెంకన్న జనగామలో పత్తి అన్లోడ్ చేసి తిరిగి మిర్యాలగూడ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. రాత్రి నుంచి ఉదయం వరకు డీసీఎం ఆన్లో ఉండగా స్థానికులకు డౌట్ వచ్చి గమనించడంతో ఈ విషయం తెలిసింది. పోలీసులకు సమాచారం అందించారు.
News October 23, 2025
NLG : ‘కాల్’ పోదు.. నెట్ రాదు.. BSNLతో తలనొప్పి

జిల్లాలో BSNL సేవల్లో అంతరాయంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వినియోగదారులు నెట్ వర్క్ సంబంధిత ఇష్యూస్ ఎదుర్కొంటున్నారు. గత కొన్ని నెలలుగా ఫోన్ కాల్స్ కనెక్ట్ కాకపోవడం.. మాట్లాడుతుండగానే మధ్యలోనే కాల్ కట్ అవడం.. ఇక ఇంటర్నెట్ సరిగ్గా అందకపోవడం వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మొబైల్ డేటా రాకపోవడంతో యూపీఐ ద్వారా ఆన్ లైన్ చెల్లింపుల్లో సైతం అంతరాయం ఏర్పడుతుంది.