News February 27, 2026

సాగర్‌లో తగ్గుతున్న నీటి నిల్వలు!

image

TG: నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 537 అడుగుల మేరకు 182 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే కనీస నీటిమట్టం 510 అడుగులకు పైన 51 టీఎంసీల లభ్యత మాత్రమే ఉందని అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. రానున్న రోజుల్లో తాగు, సాగు అవసరాలకు 65 టీఎంసీల అవసరం ఉందని తెలిపారు. అందువల్ల కనీస నీటిమట్టాన్ని కొనసాగించేందుకు కుడి, ఎడమ కాలువలకు జలాల విడుదలలో నియంత్రణ అవసరమని పేర్కొన్నారు.

Similar News

News April 12, 2026

దేశాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు

image

*అమెరికా- 56.7 డిగ్రీలు (1913)
*ట్యునీషియా- 55 (1931)
*కువైట్- 54 (2016)
*ఇరాన్- 54 (2017)
*ఇజ్రాయెల్- 54 (1942)
*ఇరాక్- 53.9 (2016)
*పాకిస్థాన్- 53.7 (2017)
*యూఏఈ- 52.1 (2002)
*భారత్- 50.6 (2016)

News April 12, 2026

విజయ్ బ్రేకులు.. వర్క్‌ఫ్రమ్ హోమ్ అంటూ DMK సెటైర్లు

image

తమిళనాడు ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. ఈ తరుణంలో TVK చీఫ్ విజయ్ తన ప్రచార సభలను వరుసగా రద్దు చేసుకోవడంపై DMK విమర్శలు గుప్పించింది. నేతలంతా ప్రజల్లో తిరుగుతుంటే ఆయన మాత్రం బ్రేకులు తీసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని ఎద్దేవా చేసింది. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. విజయ్ ఇంకా చాలా జిల్లాలు కవర్ చేయాల్సి ఉండటంతో నేరుగా జనం మధ్యకు వెళ్తేనే ఓట్లు వస్తాయని విశ్లేషకులు సూచిస్తున్నారు.

News April 12, 2026

హార్ముజ్‌లో టెన్షన్.. పాక్ ట్యాంకర్ యూటర్న్

image

హార్ముజ్ జలసంధి దగ్గర హైడ్రామా చోటుచేసుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో 2 భారీ ఆయిల్ ట్యాంకర్లు చివరి నిమిషంలో యూటర్న్ తీసుకున్నాయి. పాక్, ఇరాక్‌కు చెందిన ఈ నౌకలు ఒమన్ గల్ఫ్ నుంచి పర్షియన్ గల్ఫ్‌లోకి వెళ్లాల్సి ఉంది. కానీ ఇరాన్ దగ్గరకు రాగానే వెనక్కి వెళ్లాయి. నిజానికి పాక్, ఇరాక్ నౌకలకు తొలుత ఇరాన్ అనుమతి ఇచ్చింది. కానీ చర్చలు ఫెయిల్ కావటంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.