News May 11, 2024
‘సాగర్’లో భారీగా తగ్గిపోతున్న జలాలు

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వలు రోజురోజుకు భారీగా తగ్గుతున్నాయి. శనివారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, 504.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను, 123.0122 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో లేదని, అవుట్ ఫ్లో 400 క్యూసెక్కులు కొనసాగుతోందని తెలిపారు.
Similar News
News November 28, 2025
ఒక అభ్యర్థి 4 సెట్ల నామినేషన్లు వేయొచ్చు: ఇలా త్రిపాఠి

కలెక్టర్ ఇలా త్రిపాఠి మర్రిగూడ మండలం సరంపేట నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని తెలిపారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలను తూ.చా. తప్పకుండా పాటించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చండూర్ ఆర్డీఓ శ్రీదేవి, మర్రిగూడ తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో మున్నయ్య తదితరులు పాల్గొన్నారు.
News November 28, 2025
అభ్యర్థులకు నల్గొండ కలెక్టర్ కీలక సూచన

పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో ఎక్కడా కూడా ఖాళీగా వదిలి వేయవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ పత్రాల్లో అంశాలు ఏవైనా తమకు వర్తించకపోతే నాట్ అప్లికేబుల్ (NA) లేదా నిల్ అని రాయాలన్నారు. ఖాళీగా వదిలేస్తే మాత్రం అభ్యర్థిత్వం తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. నామినేషన్ పత్రాలను రాయడంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
News November 28, 2025
నల్గొండ: సోషల్ మీడియాపై ఎస్పీ ప్రత్యేక నిఘా

గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ సోషల్ మీడియా కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఎవరైనా అసత్య ప్రచారం చేసినా, లేక ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించాలని చూసినా, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ విషయంలో పోలీసులు ఏమాత్రం ఉపేక్షించబోరని ఆయన స్పష్టం చేశారు.


