News April 11, 2025
సాగర్ కాల్వలకు నీటి నిలిపివేత

గతేడాది డిసెంబర్ 15 నుంచి అధికారులు సాగర్ కుడి, ఎడమ కాలువలకు ఏకధాటిగా నీటి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం సాయంత్రం నీటి విడుదలను నిలిపివేశారు. ఎడమ కాల్వ కింద ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల వరకు సాగవగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలు సాగైంది. ఈ సీజన్ లో ఎడమ కాల్వకు 74 టీఎంసీల వాటర్ రిలీజ్ చేయగా, ఎడమ కాల్వకు 100 టీఎంసీలు విడుదల చేశారు.
Similar News
News December 24, 2025
VHT: భారీ విజయం.. 397 పరుగుల తేడాతో

VHTలో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచులో బిహార్ 397 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆ టీమ్ వైభవ్, ఆయుశ్, గనిల శతకాల విధ్వంసంతో 50 ఓవర్లలో <<18657571>>574<<>> రన్స్ చేసింది. ఛేదనలో అరుణాచల్ 177 పరుగులకే ఆలౌటైంది. దీంతో VHT చరిత్రలో పరుగుల పరంగా రెండో అతిపెద్ద విజయం నమోదైంది. 2022లో అరుణాచల్ ప్రదేశ్పైనే తమిళనాడు 435 రన్స్ తేడాతో గెలిచింది.
News December 24, 2025
కేసీఆర్ పాలనలో పాలమూరును ఎండబెట్టారు: రేవంత్

TG: నీటి ప్రాజెక్టుల అంశంలో KCRకు CM రేవంత్ మరోసారి కౌంటర్ ఇచ్చారు. ‘ప్రత్యేక రాష్ట్రం వస్తే నీటి సమస్య తీరుతుందని అంతా అనుకున్నాం. కానీ KCR పాలనలో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. పదేళ్లలో పాలమూరును ఎండబెట్టారు. కేసీఆర్ వలస వచ్చి పాలమూరు ఎంపీగా, తర్వాత సీఎం అయ్యారు. కానీ పాలమూరుకు నీళ్లు రాలేదు. పదేళ్లలో రూ.వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారు. ఫామ్హౌస్లు కట్టుకున్నారు’ అని కొడంగల్ సభలో ఆరోపించారు.
News December 24, 2025
హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<


