News April 11, 2025
సాగర్ కాల్వలకు నీటి నిలిపివేత

గతేడాది డిసెంబర్ 15 నుంచి అధికారులు సాగర్ కుడి, ఎడమ కాలువలకు ఏకధాటిగా నీటి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం సాయంత్రం నీటి విడుదలను నిలిపివేశారు. ఎడమ కాల్వ కింద ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల వరకు సాగవగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలు సాగైంది. ఈ సీజన్ లో ఎడమ కాల్వకు 74 టీఎంసీల వాటర్ రిలీజ్ చేయగా, కుడి కాల్వకు 100 టీఎంసీలు విడుదల చేశారు.
Similar News
News January 1, 2026
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన నటిస్తారని నిర్మాత రామ్ తళ్లూరి పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి కథా చర్చలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. డ్రీమ్ ప్రాజెక్ట్ లోడింగ్ అంటూ రాసుకొచ్చారు. వక్కంతం వంశీ ఈ మూవీకి కథ అందిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల కావాల్సి ఉంది.
News January 1, 2026
కారు డ్యాష్బోర్డులో గణపతి విగ్రహం ఉందా?

కారులో వినాయకుడి విగ్రహం ఉంచడం రక్షణకు, శుభానికి సంకేతం. విగ్రహం కూర్చున్న భంగిమలో, తొండం ఎడమ వైపుకు, డ్రైవర్ వైపు తల ఉండటం వల్ల సానుకూల శక్తి లభిస్తుందని నమ్మకం. విగ్రహం చిన్నదిగా ఉండి, డ్రైవింగ్కు అడ్డంకి కాకుండా స్థిరంగా అంటించాలి. నిత్యం శుభ్రత పాటిస్తూ, విగ్రహంపై దుమ్ము లేకుండా చూడాలి. ఒకవేళ విగ్రహం విరిగితే వెంటనే మార్చాలి. ఈ నియమాలు పాటిస్తే ప్రయాణం సురక్షితంగా, ప్రశాంతంగా సాగుతుంది.
News January 1, 2026
నేవీ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ నోటిఫికేషన్ విడుదల

<


