News February 11, 2025
సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పై కలెక్టర్ సమీక్ష

నాగర్ కర్నూల్ సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరెట్‌లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణ పై ప్రత్యేక దృష్టి సారించి భూసేకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, బీమా ప్రాజెక్టు భూసేకరణ అధికారి మధుసూదన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 24, 2025
NGKL: ఆంగ్ల పరీక్షకు 10,537 మంది హాజరు

నాగర్ కర్నూల్ జిల్లాలో సోమవారం నిర్వహించిన ఆంగ్ల పరీక్షకు 10,537 మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. 25 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 60 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.
News March 24, 2025
లక్ష్యంపై గురి తప్పకూడదంటే ఇవి తప్పనిసరి

ఎన్ని అడ్డంకులున్నా అర్జునుడికి తాను గురిపెట్టిన పక్షి కన్నే కనిపించేదట. సాధకుడికి ఎన్ని అవాంతరాలు ఎదురైనా గమ్యంపై గురి తప్పకూడదు. అలా ఉండేందుకు వ్యక్తిత్వ వికాస నిపుణులు కొన్ని మార్గాల్ని సూచిస్తున్నారు. అవి.. పని ఎప్పుడు ఎలా చేయాలన్న ప్రణాళిక ముందుగానే రచించుకోవాలి. పనుల్ని వాయిదా వేయకూడదు. ఒకేసారి అన్నీ చేసేద్దామనుకోకూడదు. ఒత్తిడికి లోనుకాకుండా అప్పుడప్పుడూ స్వల్ప విరామం తీసుకోవాలి.
News March 24, 2025
ప్యాసింజర్ల హక్కులపై ఎయిర్‌లైన్స్‌కు DGCA కఠిన ఆదేశాలు

ప్యాసింజర్ల హక్కులను తెలియజేస్తూ ముందస్తు సమాచారం ఇవ్వాలని ఎయిర్‌లైన్స్‌కు DGCA సూచించింది. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో అందుబాటులో ఉన్న ప్యాసింజర్ ఛార్టర్‌ను టికెట్ బుక్ చేసుకున్న వారికి వాట్సాప్/SMS ద్వారా పంపించాలని ఆదేశించింది. అలాగే ఈ సమాచారాన్ని టికెట్ల పైన, వెబ్‌సైట్లలో ప్రదర్శించాలని తెలిపింది. దీంతో లేటైన ఫ్లయిట్లు, పోగొట్టుకున్న లగేజీకి పరిహారం పొందడం వంటివి ప్రయాణికులకు తెలుస్తాయి.