News November 29, 2024
సాగునీటి సంఘాల ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహిస్తాం: కలెక్టర్
సాగునీటి సంఘాల ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నట్టు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాస్థాయిలో 214 మైనర్ ఇరిగేషన్, 16 మీడియం ఇరిగేషన్ సంఘాలు ఉన్నాయని, వీటి ఎన్నికలకు డిసెంబర్ 5న నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు.
Similar News
News December 10, 2024
అనంత: లక్ష్యాలను త్వరిత గతిన పూర్తి చేయాలి: కలెక్టర్
మిస్సింగ్ ఎంప్లాయిస్ అండ్ సిటిజన్స్ మ్యాపింగ్, హౌస్ ఇమేజ్ & జియో కోఆర్డినేట్స్, ఎన్పీసీఐ లింక్, సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ అటెండెన్స్, ఎంఎస్ఎంఈ సర్వే స్టేటస్ కింద కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో మిస్సింగ్ ఎంప్లాయిస్ అండ్ సిటిజన్స్ మ్యాపింగ్, హౌస్ ఇమేజ్ పై సమీక్ష చేశారు.
News December 9, 2024
బోరుగడ్డకు అనంతపురం పోలీసుల ప్రశ్నలు
అనంతపురం పోలీసులు బోరుగడ్డ అనిల్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. రాజమండ్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున అనంతపురానికి తీసుకొచ్చిన పోలీసులు డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో విచారిస్తున్నారు. సీఎం కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో పలు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టినట్లు సమాచారం. మరోవైపు ఇవాళ సాయంత్రం 4గంటలకు కస్టడీ ముగియనుంది. అనంతరం జడ్జి ముందు ప్రవేశపెడతారు.
News December 9, 2024
పెనుకొండలో ప్రతిభా పరీక్షకు 58 మంది గైర్హాజరు
పెనుకొండ నగర పంచాయతీ పరిధిలో జాతీయ ఉపకార వేతనాల కోసం విద్యార్థులకు ఆదివారం ప్రతిభా పరీక్షలను నిర్వహించారు. పరీక్ష కేంద్రాలను మండల విద్యాధికారి చంద్రశేఖర్ తనిఖీ చేశారు. ఈ పరీక్షలను 4 కేంద్రాలలో నిర్వహించినట్లు మండల విద్యాధికారి తెలిపారు. నాలుగు కేంద్రాలలో మొత్తం 968 మంది అభ్యర్థులకు గానూ 910 మంది పరీక్షలకు హాజరయ్యారు. 58 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయినట్లు తెలిపారు.