News September 22, 2024
సామర్లకోటకు చెందిన వివాహితపై బస్సులో అత్యాచారం
సామర్లకోటకు చెందిన వివాహితపై ప్రైవేటు ట్రావెల్ బస్సులో క్లీనర్ అత్యాచారానికి పాల్పడ్డాడని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి, ఎస్ఐ మన్మధ కుమార్ శనివారం తెలిపారు. హైదరాబాద్‌లో కేర్ టేకర్‌గా పనిచేస్తున్న వివాహిత స్వగ్రామానికి వెళ్లేందుకు ఈ నెల 18వ తేదీ రాత్రి HYDలోని కూకట్‌పల్లిలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎక్కారన్నారు. బస్సు బయలు దేరిన కొద్ది సేపటికే స్లీపర్ కోచ్‌లో క్లీనర్ అత్యాచారం చేశాడన్నారు.
Similar News
News October 5, 2024
నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత: మంత్రి దుర్గేష్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద కలెక్టర్ ప్రశాంతి అధ్యక్షతన జరిగిన జిల్లా బ్యాంకర్ల సంప్రదింపులు కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. యువతకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరారు.
News October 4, 2024
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ MLC అభ్యర్థిగా గోపి మూర్తి
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ MLC ఉపఎన్నికకు పీడీఎఫ్ అభ్యర్థిగా బొర్రా. గోపి మూర్తిని యుటీఎఫ్ బలపరిచింది. ఈ మేరకు ఆయన్ను బరిలో ఉంచాలని నిర్ణయించింది. ఈయన ప్రస్తుతం యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారిగా ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.
News October 4, 2024
తూ.గో: 7న కాకినాడలో జాబ్ మేళా
కాకినాడ కలెక్టరేట్ వద్ద ఈనెల 7న వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా వికాస ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చారావు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కాకినాడలో మీడియాకు ప్రకటన విడుదల చేశారు. SSC, ఇంటర్, డిప్లొమో, డిగ్రీ, బీటెక్, ఉత్తీర్ణులైన వారు ఈ జాబ్ మేళాకు అర్హులని తెలిపారు. 7న ఉదయం 9 గంటల నుంచి ఈ జాబ్ మేళా ప్రారంభం అవుతుందని తెలిపారు.