News April 1, 2025

సామర్లకోటలో క్షుద్ర పూజలు కలకలం

image

సామర్లకోట శివారు బ్రౌన్ పేట కందకం ప్రాంతంలో క్షుద్ర పూజలు కలకలం ఏర్పడింది. ఇంటి ముందు స్టార్ తరహాలో ముగ్గు వేసి, పసుపు, కుంకుమ మధ్యలో నిమ్మకాయలు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. గుర్తు తెలియని వ్యక్తులు ప్రజలను వేధించేందుకు ఇలా చేస్తున్నట్లు స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. కొద్దిపాటి అనారోగ్యం వచ్చినా క్షుద్ర పూజల ప్రభావం అనే భావన ప్రజల్లో నెలకొంది. 

Similar News

News December 2, 2025

కరీంనగర్: సెటిల్‌మెంట్ల కోసం నామినేషన్లా..?

image

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొందరు ప్రజాసేవ చేద్దామని నామినేషన్లు వేస్తుంటే మరికొందరేమో ఇదే అదునుగా దందా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు కావాలని నామినేషన్లు వేసి, ప్రధాన పోటీదారులతో మాట్లాడుకుంటున్నారు. కొంత డబ్బు తీసుకుని విత్‌డ్రా చేసుకుని సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను సైతం చివరకు బిజినెస్ చేశారని పలువురు మండిపడుతున్నారు.

News December 2, 2025

జగిత్యాల జిల్లాలో నెలరోజులు పోలీస్ యాక్ట్ అమలు

image

జగిత్యాల(D) పరిధిలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీస్ యాక్ట్ 1861 అమలులోకి వచ్చినట్లు SP అశోక్ కుమార్ తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 31 వరకు పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అలాగే డీజే వినియోగం, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడవద్దన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకరించాలని SP కోరారు.

News December 2, 2025

శ్రీలంకకు పాక్ సాయం.. ఎక్స్‌పైరీ ఫుడ్ అంటూ!

image

శ్రీలంకలో వరదలు బీభత్సం సృష్టించిన నేపథ్యంలో అక్కడి ప్రజలను ఆదుకునేందుకు ఇప్పటికే భారత ప్రభుత్వం అత్యవసర మానవతా సాయాన్ని అందించింది. అయితే ఇది చూసిన పాకిస్థాన్ ప్రభుత్వం కూడా శ్రీలంకకు ఫుడ్ ప్యాకేజీలను పంపింది. ఈ విషయాన్ని అక్కడి పాక్ హైకమిషనర్ కార్యాలయం ట్వీట్ చేయగా.. ఎక్స్‌పైరీ ఫుడ్ పంపినట్లు నెటిజన్లు గుర్తించారు. ఇలా పాడైపోయిన వాటిని పంపి డప్పు కొట్టుకోవడం ఎందుకంటూ మండిపడుతున్నారు.