News March 6, 2025
సామర్లకోట: ఇద్దరు టీచర్లు సస్పెండ్

సామర్లకోటలో ఇద్దరు టీచర్లు సస్పెండయ్యారు. వేట్లపాలెం హైస్కూళ్లో పనిచేసే ఎస్. వెంకటరమణ, నాంచారీదేవిలను డీఈవో సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులిచ్చారు. వారిపై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని తేలచడంతో వేటు పడనట్లు సామర్లకోట ఎంఈవో వై. శివరాంకృష్ణయ్య, HM అనురాధ తెలిపారు.
Similar News
News March 23, 2025
కల్వకుర్తి: నీటి సంపులో పడి మహిళ మృతి

కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ నిర్మల విద్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న బాలకృష్ణమ్మ (49) నీటి సంపులో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇంటి ఆవరణలోని సంపులో శనివారం ప్రమాదవశాత్తు జారి పడినట్లు చెప్పారు. స్థానికులు గమనించి ఆమెను బయటకు తీసేసరికి అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతురాలి భర్త 15 నెలల క్రితం చనిపోయినట్లు తెలుస్తోంది.
News March 23, 2025
మెదక్: విషాదం.. అప్పుల బాధతో రైతు మృతి

అప్పుల బాధతో రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కౌడిపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. కుషన్ గడ్డ తండాకు చెందిన పాల్త్యజీవుల (50) నెల రోజుల్లోనే తనకున్న మూడు ఎకరాల పొలంలో మూడు బోర్లు వేయించిన, నీళ్లు రాలేదు. బోర్ల కోసం రూ.3 లక్షలు అప్పు చేశాడు. దీంతో శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News March 23, 2025
ములుగు: డబ్బులు కాజేసిన రేంజర్.. ఎవరెవరి ఖాతాల్లో ఎంతంటే!

తునిగాకు బోనస్ డబ్బులను<<15852374>> ఏడుగురు అటవీశాఖ సిబ్బంది<<>> ఖాతాల్లో వేపించి రేంజర్ బాలరాజు కాజేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఏటూరునాగారం రేంజర్ అప్సరున్నిసా వివరాలు.. నర్సింహులు రూ.36,912, మహబూబ్ రూ.20,563, ప్రసాద్ రూ.39,631, వైకుంఠం రూ.39,309, కృష్ణ రూ.1,32,176, భిక్షపతి 5,557, మధుకర్ 4,511 చొప్పున వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. కాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.