News December 17, 2024

సామర్లకోట: కొనసాగుతున్న పోలీస్ పహారా

image

సామర్లకోట మండలం వేట్లపాలెంలో పోలీస్ పహారా కొనసాగుతోంది. ఇరువర్గాల దాడిలో ముగ్గురు మృతి చెందడంతో వేట్లపాలెంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా‌ సోమవారం రాత్రి నుంచి పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో పోలీస్ పికెటింగ్ కొనసాగిస్తున్నారు. DSP నిరంతరం అక్కడ పరిస్థితులను సమీక్షిస్తున్నారు

Similar News

News April 10, 2026

రాజమండ్రి ప్రజలకు గుడ్‌న్యూస్

image

రాజమండ్రి విమానాశ్రయం నుండి హైదరాబాద్‌కు Fly91 నూతన విమాన సర్వీసును రుడా (RUDA) ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ నూతన విమాన సర్వీస్ ద్వారా నగరం నుంచి కనెక్టివిటీని పెంచడంతో పాటు వ్యాపార, వాణిజ్య & పర్యాటక రంగాల్లో మరింత వృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాజమండ్రిని రవాణా పరంగా అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు.

నన్నయ్య యూనివర్సిటీ స్నాతకోత్సవాలకు ఎమ్మెల్యే బత్తుల

image

రాజానగరంలో శ్రీ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో 16, 17వ స్నాతకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ గవర్నర్‌కు దుశ్శాలువతో సత్కరించి స్వాగతం పలికారు. కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, ఆర్డీవో, తదితరులు పాల్గొన్నారు.