News April 15, 2025
సామర్లకోట: తల్లి ప్రేమకు దూరమైన చిన్నారి ప్రవల్లిక

తల్లి ప్రేమకు చిన్నారి ప్రవల్లిక దూరమైంది. ఇటీవలి అనకాపల్లి జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంలో సామర్లకోట మండలం గూడపర్తికి చెందిన దేవర నిర్మల మృతి చెందారు. ఆమె కుమార్తె చిన్నారి ప్రవల్లికను ఒక మహిళ మృత్యువు నుంచి కాపాడింది. అయితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ చిన్నారి తల్లి ప్రేమను కోల్పోయింది. తల్లి మృతి చెందిన విషయం ఆ చిన్నారికి తెలియదు. అభంశుభం తెలియని ఆ చిన్నారి తల్లి కోసం వెతుకుతోంది.
Similar News
News January 11, 2026
టెట్ నుంచి ఆ టీచర్లకు ఊరట?

సుప్రీంకోర్టు <<17587484>>తీర్పు<<>> నేపథ్యంలో టీచర్లు కూడా టెట్ రాస్తున్న విషయం తెలిసిందే. అయితే పరీక్ష సిలబస్లో తమకు సంబంధం లేని సబ్జెక్టులు ఉండటంతో వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో 2011 ముందు నియమితులైన టీచర్లకు మినహాయింపునివ్వడంపై కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల నుంచి రిపోర్టులు అడిగినట్లు సమాచారం. కేంద్రం నిర్ణయంతో 12 లక్షల మందికి పైగా టీచర్లకు ఊరట దక్కే అవకాశం ఉంది.
News January 11, 2026
మంచిర్యాల: మేడారం వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్

సమ్మక్క సారాలమ్మ దర్శనానికి మేడారం వెళ్లి తిరిగి వస్తుండగా కారు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. సింగరేణి కార్మికుడు కుచలరెడ్డి, భార్య, కూతురుతో కలిసి మేడారం జాతరకు వెళ్లారు. అమ్మవార్లను దర్శించుకుని శ్రీరాంపూర్కు తిరిగి వస్తుండగా జైపూర్ మండలం శెట్టిపల్లి వద్ద ప్రమాదవశాత్తు కారు, చెట్టును ఢీకొంది. ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు.
News January 11, 2026
సంగారెడ్డి: 11 మున్సిపాలిటీలకు సమన్వయకర్తల నియామకం

జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు బీఆర్ఎస్ సమన్వయకర్తలను ప్రకటించినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ తెలిపారు. సంగారెడ్డి-రాజనర్సు, సదాశివపేట-సపాన్ దేవ్, జహీరాబాద్-దేవి ప్రసాద్, కోహిర్-ఎంఏ హకీం, జోగిపేట- నరహరి రెడ్డి, ఖేడ్- జైపాల్ రెడ్డి, జిన్నారం-సాయిరాం, గడ్డపోతారం- సోమిరెడ్డి, ఇస్నాపూర్- శ్రీనివాస్, ఇంద్రేశం- అభిలాష్ రావులను నియమించినట్లు చెప్పారు.


