News February 1, 2025
సామర్లకోట: దేవాలయంలో వ్యక్తి అనుమానాస్పద మృతి

సామర్లకోట మండలం మాధవపట్నం బస్టాండ్ సమీపంలో ఉన్న ఆలయంలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శనివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దేవాలయంలో ఆ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 13, 2025
ఎన్టీఆర్: విద్యార్థులకు గమనిక..పరీక్షల షెడ్యూల్ విడుదల

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో బీఈడీ, స్పెషల్ బీఈడీ విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్(2022, 23, 24 బ్యాచ్‌లు) థియరీ పరీక్షలను మార్చి 10 నుంచి నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 18లోపు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చని అధికారులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పూర్తి వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU సూచించింది.
News February 13, 2025
తిరుపతి: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

తిరుపతి రూరల్ మండలం పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి రామాపురం సర్కిల్ వద్ద గురువారం అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఎంఆర్ పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 13, 2025
జట్టులో అంతమంది స్పిన్నర్లు ఎందుకు?: అశ్విన్

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విస్మయం వ్యక్తం చేశారు. ‘ఒక టూర్‌లో ముగ్గురు లేదా నలుగురు స్పిన్నర్లంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మరీ ఐదుగురు స్పిన్నర్లా..? అది కూడా దుబాయ్ పిచ్‌లో ఆడేందుకు? మరీ ఎక్కువమందిని తీసుకున్నారనిపిస్తోంది. జడేజా, అక్షర్, కుల్‌దీప్, వరుణ్, సుందర్‌లో ఎవర్ని ఆడిస్తారు? ఎవర్ని పక్కన పెడతారు?’ అని ప్రశ్నించారు.