News April 5, 2024
సామర్లకోట- పెద్దాపురం రోడ్డులో రూ.2.48 లక్షలు సీజ్
సామర్లకోట- పెద్దాపురం ఏడీబీ రహదారిలో గురువారం సాయంత్రం ఎన్నికల అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. పెద్దాపురం నుంచి కాకినాడ వైపు వెళ్తున్న ఓ వాహనంలో ఎటువంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.2.48 లక్షలు పట్టుబడినట్లు ఫ్లైయింగ్ స్క్యాడ్ అధికారి రామారావు తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పెద్దాపురం ఆర్డీవో సీతారామారావు ఆదేశాల మేరకు నగదును కాకినాడ ట్రెజరీకి జమ చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News January 16, 2025
అసలు ఎవరీ రత్తయ్య..?
సంక్రాంతి నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో వేలల్లో పందేలు జరిగాయి. వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఈసారి తాడేపల్లిగూడెంలో ఏకంగా రూ.1.25 కోట్ల పందెం జరిగింది. కోడిపందేల్లో పేరు మోసిన రత్తయ్య పుంజు, గుడివాడ ప్రభాకర్ పుంజు మధ్య రసవత్తరంగా పందెం జరిగింది. ఎంతో పేరు మోసిన రత్తయ్య పుంజు ఓడిపోవడంతో అందరూ ఖంగుతిన్నారు. అసలు ఎవరీ రత్తయ్య అని ఆరా తీయగా.. ఆయనది లింగపాలెం మండలం రంగాపురం అని తేలింది.
News January 15, 2025
గోసాల ప్రసాద్ మృతి
ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు గోసాల ప్రసాద్ బుధవారం తెల్లవారుజామున కాకినాడలోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఇంటి నుంచి బయటకు వస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు.
News January 15, 2025
తూ.గో: పందేలలో పచ్చకాకిదే హవా
ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేళ కోడి పందేల జోరు మామూలుగా లేదు. అయితే అదృష్టాన్ని, సత్తాను పరీక్షించుకునే ఈ కోడి పందేలకు సైతం శాస్త్రాలు, ముహూర్తాలు ఉంటాయని పందెం రాయుళ్లు చెబుతున్నారు. ఈ మేరకు కుక్కుట శాస్త్రం ప్రకారం మంగళవారం జరిగిన కోడి పందేల్లో పచ్చ కాకి రంగు కోడి పుంజులు ఎక్కువగా గెలుపొందినట్లు తెలుస్తోంది.