News March 5, 2025

సామ‌ర్ల‌కోట మీదుగా నాలుగు హోలీ స్పెష‌ల్ రైళ్లు

image

సామ‌ర్ల‌కోట మీదుగా నాలుగు హోలీ స్పెష‌ల్ రైళ్లు అందుబాటులోకి తెచ్చినట్లు వాల్తేర్ డివిజ‌న్ ఎస్‌డీసీఎం కె.సందీప్ బుధ‌వారం తెలిపారు. చర్లపల్లి-షాలిమార్ (07703) రైలు మార్చి 9,16, షాలిమార్-చర్లపల్లి (07704) రైలు మార్చి 11, 18, చర్లపల్లి-సంత్రాగచ్చి (07705) రైలు మార్చి 7, 21, సంత్రాగచ్చి-చర్లపల్లి (07706) రైలు మార్చి 8, 22 తేదీల్లో సామర్ల‌కోట మీదుగా రాక‌పోక‌లు నిర్వ‌హించ‌న్నాయి.

Similar News

News November 7, 2025

శ్రీ సత్యసాయి జిల్లా ఏఎస్పీగా అంకిత మహవీర్

image

పుట్టపర్తిలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా నూతన అడిషనల్ ఎస్పీగా అంకిత సురానా మహవీర్ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెడతామని, మహిళలు, చిన్నారుల రక్షణే తమ ప్రథమ కర్తవ్యమని ఏఎస్పీ ఎస్పీ పేర్కొన్నారు. తొలుత ఎస్పీ కార్యాలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు.

News November 7, 2025

ఖమ్మం: వందేమాతరం గీతాలాపనలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా.శ్రీజ, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.శ్రీజ మాట్లాడుతూ.. కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిచ్చిన వందేమాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు.

News November 7, 2025

జూబ్లీహిల్స్ బైపోల్స్: రూ.3.33 కోట్లు సీజ్

image

ఎన్నికలంటే మాటలా.. మొత్తం డబ్బుతోనే పని.. అందుకే నాయకులు వివిధ మార్గాల్లో డబ్బు తరలిస్తుంటారు. అలా వివరాలు లేక పట్టుబడిన డబ్బును పోలీసులు సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.3.33 కోట్లను సీజ్ చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. అయితే వివరాలు చెప్పిన వారికి డబ్బు తిరిగి ఇస్తున్నామని పేర్కొన్నారు.