News March 21, 2025

సామర్లకోట: రైలు నుంచి జారిపడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి

image

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ప్రమాదవశాత్తూ కిందికి జారిపడడంతో తలకు బలమైన గాయమై ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ మహిళా ఉద్యోగి మృతి చెందింది. ఈ ఘటన సామర్లకోట రైల్వే పోలీస్టేషన్ పరిధిలో జి.మేడపాడు స్టేషన్ వద్ద గురువారం జరిగింది. ప్రమాద సమయంలో కొన ఊపిరితో ఉన్న యువతిని రైల్వే ఉద్యోగులు గుర్తించి చికిత్స నిమిత్తం సామర్లకోట తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు.

Similar News

News November 5, 2025

ఆలయ పరిసరాల్లో ఇంటి నిర్మాణం చేపట్టవచ్చా?

image

దేవాలయాల పరిసరాల్లో నివాసంపై వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు ప్రత్యేక సూచన చేశారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. దేవాలయాల గోపురం నీడ పడనంత దూరం ఇల్లు ఉండాలని ఆయన అన్నారు. ‘ఆలయ శక్తి అధికంగా ఉంటుంది. ఆ గోపురం నీడ పడేంత సమీపంలో ఇల్లు ఉండడం సంసారిక సుఖానికి ఆటంకం కలిగిస్తుంది. గోపురం నీడలో నివాసం ఏర్పరచుకోవడం శాస్త్ర సమ్మతం కాదు. దైవత్వం పట్ల గౌరవం ఉంచుతూ, ఇంటికి సరైన దూరం పాటించాలి’ అని సూచించారు. <<-se>>#Vasthu<<>>

News November 5, 2025

విశాఖ డీసీపీ-1గా మణికంఠ చందోల్ బాధ్యతల స్వీకరణ

image

విశాఖ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలో డీసీపీ-1గా మణికంఠ చందోల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసి బదిలీ కాగా తిరిగి ఆయనకే డీసీపీగా పోస్టింగ్ ప్రభుత్వం ఇచ్చింది. ఆయనకు పలు కార్యక్రమాల్లో బందోబస్తు ఏర్పాటు చేయడంలోనూ సఫలీకృతమైన అనుభవం, పరిపాలన పరంగా మంచి నైపుణ్యం ఉంది.

News November 5, 2025

వికారాబాద్: అనంతగిరిలో ఘనంగా కార్తీక దీపారాధన

image

అనంత పద్మనాభ స్వామి కటాక్షంతో సుభిక్షంగా వర్ధిల్లాలని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వికారాబాద్ పట్టణానికి సమీపంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో భక్తులు స్వామివారికి పూజలు చేసి, కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాసంలో పూజలు చేస్తే, అన్ని విధాలుగా మంచి జరుగుతుందని భక్తుల అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.