News February 10, 2025

సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలానికి చెందిన సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ మృతి చెందినట్లు వారి బంధువులు తెలిపారు. హైదరాబాదులో స్థిరపడ్డ ఆయన కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కూటమి నాయకులు హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రిలో చికిత్సకు దోహదపడ్డారు. ఆయన మరణ వార్త విని ధర్మవరం నియోజకవర్గ ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. 10 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

Similar News

News December 21, 2025

మహిళలకు స్మార్ట్ కిచెన్‌ల బాధ్యతలు!

image

AP: మహిళా స్వయం సహాయక సంఘాల(SHG)కు ప్రభుత్వం కీలక బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పక్కాగా అమలు చేసేందుకు వారికి స్మార్ట్ కిచెన్‌ల నిర్వహణను అప్పగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో పలు స్మార్ట్ కిచెన్‌లలో అన్ని పనులను పూర్తిగా మహిళలే పర్యవేక్షిస్తున్నారు. దీంతో త్వరలో మరిన్నింటిని మహిళా సంఘాలకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

News December 21, 2025

HYD: కొండెక్కిన కోడి గుడ్డు ధర

image

సామాన్యుడి నిత్యవసర వస్తువుగా మారిన కోడి గుడ్డు ధర HYD, ఉమ్మడి రంగారెడ్డిలో కొండెక్కింది. బహిరంగ మార్కెట్లో గుడ్డు ధర రూ.8, 9 ఉండగా, హోల్ సేల్‌లో రూ.7.50 వరకు పలుకుతోంది. సాధారణంగా రూ.5- 6 పలికే గుడ్డు ధర ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో బ్యాచిలర్లు, వర్క్ అవుట్స్ చేసేవారు లబోదిబోమంటున్నారు. ప్రస్తుత ధర పౌల్ట్రీ చరిత్రలో రికార్డు అని, ఉత్పత్తి తగ్గడమే ధర పెరగడానికి కారణమని పౌల్ట్రీ నిర్వాహకులు తెలిపారు.