News July 23, 2024

సామాన్యులకు దడ పుట్టిస్తున్న కూరగాయల ధరలు.!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంట పుట్టిస్తున్న కూరగాయల ధరలు చూసి సామాన్యుల ఇళ్లల్లో నిత్యం వంట చేసుకోవడం ఓ తంటగా మారింది. రూ.250లకు వారం రోజులకు సరిపడా కూరగాయలు వచ్చేవి. అలాంటిది ప్రస్తుతం రూ.600 ఖర్చు చేసినా వారం రోజులు సరిపడా కూరలు లభించడం లేదని జనాలు వాపోతున్నారు. ప్రతిరోజు ఆహారంలో ప్రతి ఒక్కరూ ఉపయోగించే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డల ధరలు ఆకాశన్నంటుతుండడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

Similar News

News October 9, 2024

రేపు దద్దరిల్లనున్న ఖమ్మం

image

సద్దుల బతుకమ్మ వేడుకలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ముస్తాబైంది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో మైదానాలు బతుకమ్మ వేడుకలకు రెడీ అయ్యాయి. వేలాది మంది ఆడపడుచులు అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను చేసి జిల్లా కేంద్రాలతో ప్రధాన పట్టణాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సెంటర్లకు తీసుకొస్తారు. మైదానాల్లో మున్సిపల్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

News October 9, 2024

బతుకమ్మ పూల కోసం చెరువులో దిగి వ్యక్తి మృతి

image

అశ్వాపురం మండలం జగ్గారంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నున్న ఐలయ్య బతుకమ్మ పండుగ పూల కోసంకోసం గ్రామ పరిధిలో ఉన్న ఊర చెరువులో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. నున్న ఐలయ్య మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఐలయ్య మణుగూరు సురక్ష బస్టాండ్‌లో హమాలీ కార్మికుడిగా పనిచేస్తున్నాడని స్థానికులు తెలిపారు.

News October 9, 2024

దసరా స్పెషల్.. HYD – KMM మధ్య బస్సులు

image

దసరా పండుగ సందర్భంగా TGSRTC ఈరోజు నుంచి 11 వరకు హైదరాబాద్ – ఖమ్మం మధ్య స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ సరి రామ్ తెలిపారు. ఖమ్మం – హైదరాబాద్ మార్గంలో నాన్ స్టాప్ షటిల్ సర్వీసులు నడపుతున్నట్లు చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాలకు వెళ్లే మహాలక్ష్మి ప్రయాణికుల కోసం LB నగర్ నుంచి ఎక్కువ బస్సులు ఉంటాయన్నారు.