News August 14, 2024
సాయంత్రంలోగా నిందితులను పట్టుకుంటాం: కర్నూల్ ఎస్పీ

పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసులో ఆధారాలు సేకరించామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. సాయంత్రంలోగా నిందితులను పట్టుకుంటామని అన్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. శ్రీనివాసులు తలపై వెనుక నుంచి గొడ్డలితో నరికినట్లు గుర్తించామన్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
Similar News
News October 25, 2025
పోలీసుల అదుపులో శివశంకర్ స్నేహితుడు

కర్నూలు బస్సు ప్రమాదంలో శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన ఎర్రిస్వామి ప్రమాదానికి ముందు శివశంకర్ బైక్ ఎక్కారు. వీరిద్దరూ పెట్రోల్ బంకులో ఉన్న <<18098159>>CC వీడియో<<>> బయటకొచ్చింది. బస్సు-బైక్ ఢీకొన్న ఘటనలో శివశంకర్, ఎర్రిస్వామి ఇద్దరూ ఎగిరి పడినట్లు తెలుస్తోంది. ఘటనలో శివశంకర్ మృతిచెందగా ఎర్రిస్వామి గాయాలతో బయటపడ్డారు.
News October 25, 2025
అతనెవరు.. తెలిస్తే చెప్పండి: కలెక్టర్

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మరణించిన గుర్తుతెలియని వ్యక్తిని గుర్తిస్తే కంట్రోల్ రూమ్ 08518 277305కు ఫోన్ చేసి తెలపాలని కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన బస్సులో హైదరాబాద్ ఆరంఘర్ చౌరస్తాలో ఎక్కినట్లు తెలిసిందన్నారు. అతని పేరు ప్రయాణికుల జాబితాలో లేదని తెలిపారు. వయసు 50 ఏళ్లు ఉండవచ్చని, అతని వివరాలు తెలిస్తే తెలపాలని కోరారు.
News October 24, 2025
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రులు

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఘటన జరిగిన తీరును జిల్లా పోలీసు అధికారులు మంత్రులకు వివరించారు. మంత్రులతో పాటు డీజీపీ హరీశ్, డీఐజీ ప్రవీణ్, జిల్లా కలెక్టర్ ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్లు ఉన్నారు.


