News October 14, 2024
‘సాయిబాబా మరణానికి మోదీ ప్రభుత్వం బాధ్యత వహించాలి’

ప్రొఫెసర్ సాయిబాబా మరణానికి మోదీ ప్రభుత్వం బాధ్యత వహించాలని సీపీఎం పార్టీ నాయకులు అబ్దుల్ నబి అన్నారు. ఆదివారం సీపీఎం పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ సాయిబాబా సంతాప సభను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రొఫెసర్ సాయిబాబాపై అనేక అక్రమ కేసులను బనాయించి జైలులో నిర్బంధించారని అన్నారు. సాయిబాబా మరణం ప్రజాస్వామ్య వాదులకు తీరని లోటు అని అన్నారు.
Similar News
News December 4, 2025
ఖమ్మం: ఏపీ సీఎం సతీమణి వాహానం తనీఖీ

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అధికారులు తనిఖీలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లా నాయికన్ గూడెం చెక్ పోస్టు వద్ద ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వాహనాన్ని తనీఖీ చేశారు. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ఆమె వాహనాన్ని తనీఖీ చేశారు. ఆమె వెళ్తున్న వివరాలను అధికారులు నోట్ చేసుకున్నారు.
News December 4, 2025
రఘునాథపాలెం: ప్రజాస్వామ్యంలోకి ఎన్నికలు అత్యంత కీలకం: DCP

గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని అడిషనల్ డీసీపీ లా & ఆర్డర్ ప్రసాద్ రావు అన్నారు. గురువారం రఘునాథపాలెం మండలంలో ఎన్నికలకు నామినేషన్ వేసిన సర్పంచులు, వార్డ్ సభ్యుల అభ్యర్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకమని, స్థానిక ఎన్నికలను అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
News December 4, 2025
ఖమ్మం: ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం: కలెక్టర్

పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ సర్పంచి పోస్టులకు సంబంధించి ఫలితాలు నిబంధనల ప్రకారం ప్రకటించాలని కమిషనర్ పేర్కొన్నారు.


