News April 24, 2024
సాయి ప్రసాద్ రెడ్డి ఆస్తి వివరాలు

ఆదోని వైసీపీ అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. దంపతుల ఆస్తి మెుత్తం రూ.13.77 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. చరాస్తి: రూ.1.85కోట్లు, స్థిరాస్తి:రూ.4.22కోట్లు, అప్పులు:రూ.1.22కోట్లు, నగదు:10.30లక్షలు ఉన్నాయి. అంతేగాక 25 తులాల బంగారం, రూ.3లక్షల విలువగల వెండి ఉన్నట్లు వెల్లడించారు. ఆయనకు వాహనం లేనట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
Similar News
News December 17, 2025
కర్నూలు ఎస్పీ హెచ్చరిక

జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు ‘విజిబుల్ పోలీసింగ్’ను బలోపేతం చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా వాహనాల తనిఖీలు, సైబర్ నేరాలపై అవగాహన, రహదారి భద్రత నియమాల అమలు చేపడుతున్నారు. మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు సమస్యలు ఎదురైతే డయల్ 112 లేదా 100కు సమాచారం ఇవ్వాలన్నారు.
News December 16, 2025
క్రీడల అభివృద్ధికి కృషి చేస్తాం: ఏపీఐఐసీ డైరెక్టర్

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని APIIC డైరెక్టర్ దోమా జగదీశ్ గుప్తా అన్నారు. మంగళవారం కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో కర్నూలు జిల్లా నెట్ బాల్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా నెట్ బాల్ సీనియర్ క్రీడాకారుల ఎంపిక పోటీలను జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర బాబుతో కలిసి ప్రారంభించారు. నగరాన్ని స్పోర్ట్స్ సిటీగా తీర్చేందుకు మంత్రి కృషి చేస్తున్నారన్నారు.
News December 16, 2025
కర్నూలు పోలీస్ స్పందనకు 108 ఫిర్యాదులు

ఉద్యోగాల పేరుతో మోసపోవద్దని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పార్టీలు తెలిపారు. కర్నూల్ టూ టౌన్ పక్కన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ప్రజల వినతులను స్వీకరించారు. PGRSకు సోమవారం 108 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఉద్యోగాల పేరుతో మోసాలు, గల్లంతైన వ్యక్తులు, సైబర్ నేరాలు, కుటుంబ వేధింపులు, ఆస్తి వివాదాలు వంటి పలు సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ తెలిపారు. వాటిని త్వరగా పరిష్కరించాలన్నారు.


