News November 26, 2024
సాయుధ దళాల కుటుంబాల సంక్షేమానికి సహకరించాలి: కలెక్టర్

దేశ రక్షణకు నిరంతర సేవలు అందిస్తూ యుద్ధ సమయంలో అమరులు, పదవీ విరమణ చేసిన సాయుధ దళాల కుటుంబాల సంక్షేమానికి అన్ని వర్గాల ప్రజలు తమ వంతు సహాయ, సహకారాలు అందించాలని కలెక్టర్ రంజిత్ బాషా పిలుపునిచ్చారు. మంగళవారం తన ఛాంబర్‌లో త్రిసాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సాయుధ దళాల పతాక స్టిక్కర్స్, కార్ ప్లాగ్‌ను ఆవిష్కరించారు. జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి రత్న రూత్ పాల్గొన్నారు.
Similar News
News January 5, 2026
పీహెచ్సీలో వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

పీహెచ్సీలో వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ డా. ఏ.సిరి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌కు సంబంధించి చాలా అంశాలలో ప్రజల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందన్నారు. అయితే వైద్య ఆరోగ్యం, సర్వే, రెవెన్యూ అంశాల్లో ఇంకా కొంత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
News January 5, 2026
కర్నూలు జిల్లా ప్రజలకు డీఐజీ సూచనలు

పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే FIR ప్రతిని పొందే సౌకర్యాన్ని వాట్సాప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’లో అందుబాటులోకి తెచ్చినట్లు డీఐజీ, కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 95523 00009 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ పంపి Police Services – Download FIR ఎంపిక ద్వారా FIR డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
News January 5, 2026
కర్నూలు: పోలీస్ పీజీఆర్ఎస్‌కు 84 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని డీఐజీ, కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ హామీ ఇచ్చారు. కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 84 ఫిర్యాదులు స్వీకరించారు. మోసాలు, చీటింగ్, పంట దోపిడీ తదితర అంశాలపై పోలీసు అధికారులు తక్షణ స్పందించాలని ఆదేశించారు.


