News January 6, 2025
సారంగాపూర్: కత్తితో పొడిచారు.. అరెస్టయ్యారు
ఓ యువకుడిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తి అరెస్టయిన ఘటన సారంగాపూర్ మండలంలో ఆదివారం జరిగింది. గ్రామీణ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. బోరేగాం గ్రామానికి చెందిన షేక్ అర్షద్ అదే గ్రామానికి చెందిన సాయికుమార్ డిసెంబర్ 31న గొడవపడ్డారు. ఇది మనసులో పెట్టుకున్న సాయికుమార్ ఓ మైనర్‌తో కలిసి ఈ నెల 4న కత్తితో అర్షద్‌ను పొడిచి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులిద్దరిని అరెస్టు చేశారు.
Similar News
News January 23, 2025
ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధరల వివరాలు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో గురువారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,020గా నిర్ణయించారు. బుధవారం ధరతో పోలిస్తే గురువారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.80 తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
News January 22, 2025
MNCL:మల్టీ లెవెల్ స్కీమ్స్‌తో అప్రమత్తంగా ఉండాలి:CP
మల్టీ లెవెల్ స్కీమ్స్‌తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనరేట్ సీపీ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటన పట్ల ఆకర్షితులై మోసపోవద్దని హెచ్చరించారు. అనేక స్కీములతో బురిడీ కొట్టిస్తున్నారని తెలిపారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడితే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. స్థానిక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఆశ్రయించాలని పేర్కొన్నారు.
News January 22, 2025
నిర్మల్: కాశీలో గుండెపోటుతో ఫార్మసిస్టు మృతి
నిర్మల్‌లోని ప్రధాన ఆస్పత్రిలో ఆయుర్వేద ఫార్మసిస్టుగా పనిచేస్తున్న ఫణిందర్ (50) గుండెపోటుతో మృతి చెందాడు. పట్టణంలోని బుధవార్ పేట్ కాలనీకి చెందిన ఫణిందర్ ఉత్తర్ ప్రదేశ్‌లోని కుంభమేళాకు వెళ్లారు. కాశీలో దైవ దర్శనం చేస్తున్న క్రమంలో గుండెపోటుతో మంగళవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.