News October 18, 2024

సారంగాపూర్: నీటిలో గుర్తు తెలియని శిశువు మృతదేహం

image

కల్వర్టు నీటిలో శిశువు మృతదేహం లభ్యమైన ఘటన సారంగాపూర్ మండలం బోరేగాం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై శ్రీకాంత్ వివరాల మేరకు… గ్రామ శివారులోని చిన్న కల్వర్టు దగ్గర నీటిలో ఒక మగ శిశువు స్థానికులకు కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Similar News

News October 31, 2025

ADB: శిశు మరణాల నివారణకు పని చేయాలి

image

ఆదిలాబాద్ వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం జరిగిన నవజాత శిశు సంరక్షణ శిక్షణ ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణలో ప్రతిభ చూపిన వైద్యులు, సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలు, మెమొంటోలను అందజేశారు. శిశు మరణాల నివారణకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News October 31, 2025

ADB: ఏకలవ్య గురుకులాల ప్రిన్సిపల్స్‌తో కలెక్టర్ సమీక్ష

image

కలెక్టరేట్‌లో గురువారం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ రాజర్షి షా నిర్వహించారు. ఏకలవ్య పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు అందిస్తున్న వసతులు, నాణ్యమైన విద్యపై ఆయన ప్రిన్సిపల్స్‌ను ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సలోని చబ్రా, డీఎంహెచ్‌వో, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

News October 30, 2025

ఆదిలాబాద్: ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రీషెడ్యూల్

image

ఆదిలాబాద్ నుంచి గురువారం దయం 8 గంటలకు బయలుదేరాల్సిన ఆదిలాబాద్-నాందేడ్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ సమయాన్ని రైల్వే శాఖ రీషెడ్యూల్ చేసింది. ఈ రైలు ఉదయం 8 గంటలకు బదులుగా ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ నుంచి బయలుదేరుతుంది. అలాగే, ఈ రైలు సేవలను ముద్ఖేడ్-నాందేడ్-ముద్ఖేడ్ మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.