News February 14, 2025
సారంగాపూర్: పాముకాటుతో 18 నెలల బాలుడు మృతి

సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్కు చెందిన 18 నెలల విహాంత్ అనే బాలుడికి పాము కాటు వేయడంతో గురువారం సాయంత్రం మృతి చెందాడు. ఆరు బయట అక్కతో ఆడుకుంటున్న విహాంత్ను ఇంటి పక్కన ఉన్న పొద నుంచి వచ్చిన పాము కాటు వేసింది. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Similar News
News December 13, 2025
మంగళగిరి: సీఎం సభా ఏర్పాట్లు పరిశీలించిన హోం మంత్రి

మంగళగిరి APSP 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో ఈ నెల 16న కానిస్టేబుల్ ఉద్యోగాలకు నూతనంగా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. శనివారం సభా ఏర్పాట్లను హోంమంత్రి అనిత.. డీఐజీ ఏసుబాబు, ఎస్పీ వకుల్ జిందాల్, బెటాలియన్ కమాండెంట్ నగేశ్ బాబులతో కలిసి పరిశీలించారు. అభ్యర్థులు వారి కుటుంబాలతో కలిసి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె చెప్పారు.
News December 13, 2025
మెస్సీ టూర్.. నిర్వాహకుడి అరెస్ట్

కోల్కతాలో మెస్సీ టూర్లో నెలకొన్న గందరగోళంపై బెంగాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిర్వాహకుడిని అరెస్ట్ చేసింది. టికెట్లు కొని స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్కు డబ్బులు రీఫండ్ చేయిస్తోంది. అటు ఘటనపై ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం మిస్మేనేజ్మెంట్కు గల కారణాలపై ఆరా తీస్తోంది. కాగా మెస్సీతో పాటు అభిమానులకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే క్షమాపణలు చెప్పారు.
News December 13, 2025
18 నుంచి వినియోగదారుల వారోత్సవాలు: DSO

ఈనెల 18 నుంచి జాతీయ వినియోగదారుల దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నందున ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాల్లో వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించు కొని ఈనెల 18 మంది 24 వరకు కోనసీమ జిల్లాలు జాతీయ వినియోగదారుల వారోత్సవ వేడుకలు జరగనున్నాయని ఆయన తెలిపారు.


