News February 2, 2025
సారంగాపూర్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని కంకట గ్రామానికి చెందిన బురారీ ముకేశ్ ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రముఖ ట్రావెల్స్ బస్సులో హెల్పర్‌గా పనిచేస్తున్న ముఖేష్ తమిళనాడులోని తిరువన్నలై నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా లారీ ఢీకొని మృతిచెందాడని తెలిపారు.
Similar News
News February 18, 2025
మనూ భాకర్‌కు బీబీసీ పురస్కారం

భారత స్టార్ షూటర్ మనూ భాకర్‌కు ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం దక్కింది. పారిస్ ఒలింపిక్స్‌లో ప్రదర్శనకు గాను ఆమెకు ఈ అవార్డు లభించింది. క్రికెటర్ స్మృతి మంథాన, రెజ్లర్ వినేశ్ ఫొగట్, గోల్ఫర్ అదితీ అశోక్, పారా షూటర్ అవనీ లేఖరా పేర్లు నామినేషన్లో ఉండగా భాకర్‌నే పురస్కారం వరించడం విశేషం. పారిస్ ఒలింపిక్స్ షూటింగ్‌లో మనూ రెండు కాంస్య పతకాల్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే.
News February 18, 2025
ఎల్లారెడ్డిపేట: విషాదం.. వ్యక్తి ఆత్మహత్య

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రమాకాంత్ తెలిపిన వివరాలు.. హనుమ కనకయ్య(40) అప్పుల బాధతో మద్యానికి బానిస అయ్యాడు. సోమవారం ఉదయం అతడి బెడ్రూమ్‌లో ఉరేసుకుని చనిపోయినట్లు అతడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
News February 18, 2025
మాస్ కాపీయింగ్‌పై నిర్మల్ కలెక్టర్‌కు ఫిర్యాదు

ఇటీవల జరిగిన ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ జరిగిందని ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామస్థులు సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లావ్యాప్తంగా జరిగిన ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లో కేవలం భైంసా పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసిన 61 మంది విద్యార్థులకు మెరిట్ వచ్చిందన్నారు. మాస్ కాపీయింగ్‌పై తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని దీనిపై విచారణ జరపాలని కోరారు.