News August 23, 2024

సారవకోట: గడ్డి మందు తాగి వ్యక్తి మృతి

image

సారవకోట మండలం బుడితి గ్రామానికి చెందిన డి పోలరావు (48) మద్యం మత్తులో ఈనెల 21వ తేదీన కలుపు నివారణ గడ్డి మందు తాగడంతో మృతి చెందాడు. . బుడితి పీహెచ్సీ‌లో చికిత్స అందించినప్పటికీ మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి బాధితుడిని తరలించారు. గురువారం రిమ్స్‌లో పోలరావు మృతి చెందినట్లు తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్సై లక్ష్మీనారాయణ తెలిపారు.

Similar News

News September 13, 2024

బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ విఫలం: ధర్మాన

image

విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. ఇచ్చాపురంలో స్థానిక నాయకులతో ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

News September 13, 2024

శ్రీకాకుళం: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

image

శ్రీకాకుళంలో లోక్ అదాలత్ మొత్తం 21 బెంచ్‌లు ఏర్పాటు చేశామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జునైద్ అహ్మద్ మౌలానా శుక్రవారం వెల్లడించారు. జిల్లాల మొత్తం పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులు 2751 గుర్తించడం జరిగిందన్నారు. ప్రీ లిటిగేషన్ కేసులు 545 ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఆయన వెంట కార్యదర్శి, ఆర్ సన్యాసి నాయుడు ఉన్నారు.

News September 13, 2024

శ్రీకాకుళం: డిగ్రీ ITEP కోర్సులో దరఖాస్తుకు నేడే లాస్ట్

image

శ్రీకాకుళం DRBRAU నిర్వహిస్తున్న డిగ్రీ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (ITEP)కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగుస్తుంది. అభ్యర్థులు www.brau.edu.in లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు బిఏబిఈడీలో 50 సీట్లు, బీఎస్సీబీఈడీలో 50 సీట్లు ఉన్నాయి. ఇంటర్ తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన ఎస్సీపిటి పరీక్షల్లో స్కోర్ సాధించిన వారికి ప్రవేశాలు నిర్వహిస్తారు.