News May 29, 2024

సారవకోట: గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

సారవకోట మండలం అన్నుపురం గ్రామానికి చెందిన యడ్ల పోలీసు(65) డాబా పై నుంచి జారిపడి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసు ఈ నెల 23న రాత్రి భోజనం చేసి డాబాపై నిద్రించాడు. మూత్ర విసర్జనకు కిందకు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో కేజీహెచ్‌కు తరలించగా వైద్య సహాయం పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Similar News

News February 23, 2026

SKLM: ‘జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి’

image

మార్చి 14న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్మన్ జూనైద్ అహమ్మద్ మౌలానా పేర్కొన్నారు. సోమవారం జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న అత్యధికంగా కేసులు రాజీ చేసేందుకు అధికారులు ప్రయత్నం చేయాలని సూచించారు. మోటర్ యాక్సిడెంట్ కేసుల్లో ఇన్సూరెన్స్ సంస్థలు త్వరితగతిన న్యాయం చేయాలన్నారు. ASP రమణ ఉన్నారు.

News February 23, 2026

శ్రీకాకుళం: ప్రయాణికులకు గమనిక

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే భువనేశ్వర్-బెంగళూరు-భువనేశ్వర్ (రైలు నం.18463/64) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు 3వ ఏసీ భోగిని అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలు శ్రీకాకుళం రోడ్డు, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం తదితర రైల్వే స్టేషన్లలో ఆగనుంది.

News February 23, 2026

శ్రీకాకుళం: ‘ఇంటర్ పరీక్షకు 662 మంది డుమ్మా’

image

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం మొదటి రోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 662 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఆర్ఐఓ ఆర్.సురేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 71 కేంద్రాల్లో 20,377 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 19,715 మంది హాజరైనట్లు తెలిపారు. 96.75 హాజరు శాతం నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు. మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరుగినట్లు, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదన్నారు.