News March 13, 2025
సారా తయారీపై డ్రోన్లతో నిఘా: కలెక్టర్

జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో నాటు సారా తయారీపై నిఘా కోసం డ్రోన్లు వినియోగించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. నాటుసారా తయారీ, రవాణా, వినియోగాన్ని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు. నవోదయం 2.0 కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నాటుసారా తయారీతోపాటు నాటుసారా వినియోగం వల్ల వచ్చే నష్టాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
Similar News
News September 19, 2025
మెదక్: 22 నుంచి ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు

మెదక్ పట్టణంలో ఈనెల 22 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈవో డా.రాధాకిషన్ తెలిపారు. బాలికల పాఠశాలలో పదో తరగతి, బాలుర పాఠశాలలో ఇంటర్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. పదో తరగతికి 194 మంది, ఇంటర్‌కు 524 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు వివరించారు.
News September 19, 2025
బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా?

రోజులో చాలా ముఖ్యమైన మీల్ బ్రేక్‌ఫాస్ట్. కానీ, చాలామంది దానిని స్కిప్ చేస్తుంటారు. నైట్ ఎక్కువ తిన్నారనో, బరువు తగ్గాలనో కారణం ఏదైనా టిఫిన్ చేయడం మానేస్తారు. దాంతో మెదడుకు కావాల్సిన ఎనర్జీ దొరక్క ఏకాగ్రత లోపిస్తుంది. బ్లోటింగ్, అజీర్తి, గుండె సమస్యలు వస్తాయి. బరువు కూడా పెరుగుతారు. మరోవైపు టిఫిన్ ఆలస్యంగా చేస్తే ఆయుష్షు 8-10 శాతం తగ్గుతుందని మాంచెస్టర్ యూనివర్సిటీ స్టడీ చెబుతోంది. SHARE IT.
News September 19, 2025
నేడు ఒమన్‌తో భారత్ మ్యాచ్

ఆసియా కప్‌లో భారత్ ఆఖరి గ్రూప్ మ్యాచ్‌కి రెడీ అవుతోంది. నేడు దుబాయ్ వేదికగా ఒమన్‌తో SKY సేన తలపడనుంది. ఇప్పటికే PAK, UAEలపై గ్రాండ్ విక్టరీలు సాధించిన IND సూపర్-4కి చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇవాళ్టి నామమాత్రపు మ్యాచును సూపర్-4కి ప్రాక్టీస్‌గా ఉపయోగించుకోనుంది. ఈమేరకు జట్టులో పలు మార్పులు చేసే ఛాన్సుంది. బుమ్రా, కుల్దీప్/వరుణ్‌లకు రెస్ట్ ఇచ్చే అవకాశముంది. మ్యాచ్ రా.8గంటలకు ప్రారంభమవుతుంది.