News April 25, 2024
సార్వత్రిక ఎన్నికల్లో 100% పోలింగ్ సాధించాలి: విశాఖ జేసీ

సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ లక్ష్యాలను చేసుకోవటంలో అధికార యంత్రాంగానికి, ఓటర్లకు సహకారం అందించాలని జాయింట్ కలెక్టర్, తూర్పు నియోజకవర్గ ఆర్.వో. కె. మయూర్ వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను కోరారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారందరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. ఎన్నికల ప్రక్రియలో పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు.
Similar News
News December 16, 2025
విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా చోడే పట్టాభిరామ్?

విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా చోడే పట్టాభి రామ్‌కు పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పించినట్లు సమాచారం. పట్టాభి 8వ వార్డులో మాజీ కార్పొరేటర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆయన టీటీడీ బోర్డు లోకల్ అడ్వైజర్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.
News December 16, 2025
‘సంక్రాంతికి విశాఖ-హైదరాబాద్ ప్రత్యేక రైళ్లు నడపండి’

సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా విశాఖపట్నం – హైదరాబాద్ మధ్య తక్షణమే ప్రత్యేక రైళ్లు నడపాలని బీజేపీ రాష్ట్ర విధాన పరిశోధన విభాగ సభ్యుడు డాక్టర్ కె.వి.వి.వి.సత్యనారాయణ వాల్తేరు డీఆర్‌ఎంను కోరారు. ప్రస్తుతం రైళ్లన్నీ ‘రిగ్రెట్’ (Regret) స్థితిలో ఉన్నాయని, ప్రయాణికుల సౌకర్యార్థం భోగికి వారం ముందు, కనుమ తర్వాత అదనపు రైళ్లు, కోచ్‌లు ఏర్పాటు చేయాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.
News December 16, 2025
విశాఖ: సముద్రంలో మత్స్యకారుడు గల్లంతు

పూసపాటిరేగకు చెందిన వాసుపల్లి రాములు (55) సముద్రంలో గల్లంతయ్యాడు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి శుక్రవారం బోటులో వేటకు వెళ్లాడు. ఆదివారం రాత్రి తీరానికి 70 మైళ్ల దూరంలో ఆయన ప్రమాదవశాత్తు బోటుపై నుంచి సముద్రంలో జారిపడ్డాడు. సహచర సిబ్బంది గాలించినా ఆచూకీ లభించలేదని, మంగళవారం సాయంత్రం ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసినట్లు పోర్ట్ సీఐ రమేశ్ తెలిపారు.


